హీట్‌వేవ్‌ అలర్ట్: భారత వాతావరణ శాఖ ట్వీట్ | Sakshi
Sakshi News home page

హీట్‌వేవ్‌ అలర్ట్: భారత వాతావరణ శాఖ ట్వీట్

Published Mon, Apr 29 2024 5:05 PM

Heat Waves Protect IMD Tweet

న్యూఢిల్లీ: భారత వాతావరణ శాఖ (IMD) సోమవారం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. దీనికి సంబంధించిన ఇండియా మ్యాప్‌ను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది. ఇందులో హీట్‌వేవ్‌ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను హైలెట్ చేసింది.

గంగా పశ్చిమ బెంగాల్, బీహార్‌లోని అనేక ప్రాంతాల్లో హీట్ వేవ్ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయని, ఒడిషా, తూర్పు ఉత్తరప్రదేశ్, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లో వేడి తరంగాలకు అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.

హీట్ వేవ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను వెల్లడించడం మాత్రమే కాకుండా.. హీట్ వేవ్ పరిస్థితుల్లో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఐఎండీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.

  • మీకు దాహం లేకపోయినా మిమ్మల్ని మీరు హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి తగినంత నీరు/ఓఆర్ఎస్ తాగండి.
  • వేడి ఎక్కువగా ఉండటం వల్ల 12 గంటల నుంచి 4 గంటల వరకు బయట చేయాల్సిన పనిని కొంత వాయిదా వేసుకోండి.
  • వేడి నుంచి తప్పించుకోవడానికి నీడగా ఉండే ప్రదేశాల్లో నిలబడండి.
  • పిల్లలు, వృద్దులు, జబ్బుపడిన వారిని ఎండ వేడి నుంచి జాగ్రత్తగా కాపాడుకోవాలి.
  • ఎండ సమయంలో లేత రంగు బట్టలను ధరించండి.
  • తలను కప్పుకోవదానికి గుడ్డ, టోపీ వంటి వాటిని ఉపయోగించాలి.

Advertisement
Advertisement