పెద్దల ఔషధాలు పిల్లలకు వద్దు

Govt issues guidelines on Covid treatment for children - Sakshi

కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టీకరణ

వైరస్‌ సోకిన పిల్లల చికిత్సలో అలసత్వం పనికిరాదు

చిన్నారుల కోవిడ్‌–కేర్‌ సేవల నూతన మార్గదర్శకాలు విడుదల  

న్యూఢిల్లీ:  కోవిడ్‌–19 చికిత్సలో భాగంగా పెద్దలకు ఇస్తున్న కొన్నిరకాల ఔషధాలను పిల్లలకు కూడా ఉపయోగిస్తున్నారని, ఇలా చేయడం సరైంది కాదని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. కరోనా మూడో వేవ్‌లో పాజిటివ్‌ కేసులు భారీగా నమోదయ్యే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో చిన్నారుల కోవిడ్‌–కేర్‌ సేవల విషయంలో బుధవారం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఐవర్‌మెక్టిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్, ఫావిపిరావిర్‌ వంటి డ్రగ్స్, డాక్సీసైక్లిన్, అజిత్రోమైసిన్‌ వంటి యాంటీబయాటిక్స్‌ను పిల్లలకు ఇవ్వొద్దని ప్రతిపాదించింది. వీటిని కరోనా బారినపడిన పెద్దల కోసమే ఉపయోగించాలని గతంలోనే సూచించినట్లు గుర్తుచేసింది. వైరస్‌ సోకిన పిల్లలకు చికిత్స అందించడంలో అలసత్వం పనికిరాదని, తగిన మౌలిక సదుపాయాలను ఇప్పటినుంచే ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఇప్పుడున్న సదుపాయాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని తెలిపింది. ఎలాంటి అనూహ్య పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.

ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాలు
► ఇప్పటికే ఇతర వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు కరోనా సులభంగా సోకే ప్రమాదం ఉంది. అందుకే పిల్లలకు సైతం కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక అలాంటివారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి.

► కరోనా చికిత్సలో పెద్దలకు ఉద్దేశించిన ఔషధాలను పిల్లలపై ప్రయోగించకూడదు. వాటిని పిల్లల కోసం సిఫార్సు చేయలేదు.

► భవిష్యత్తులో కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగితే.. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలు కలిసికట్టుగా పనిచేయాలి.

► లాక్‌డౌన్‌లు పూర్తిగా ఎత్తివేశాక, పాఠశాలలు, కళాశాలలు మళ్లీ తెరిచాక ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఉమ్మడిగా ఎదుర్కోవాలి.
 

► జిల్లాల్లో కరోనా సెకండ్‌ వేవ్‌ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు నమోదైన రోజువారీ కేసుల ఆధారంగా థర్డ్‌వేవ్‌లో ఎంతమంది పిల్లలకు కరోనా సోకనుందో, వారిలో ఎంతమంది ఆసుపత్రుల్లో చేరుతారో అంచనాకు రావొచ్చు. దీనిప్రకారం కరోనా బాధిత పిల్లల సంరక్షణ కోసం ఆసుపత్రుల్లో అదనపు పడకలు ఏర్పాటు చేయాలి.

► సుశిక్షితులైన వైద్యులు, నర్సులను నియమించుకోవాలి. వైద్య సిబ్బంది విషయంలో కొరత రాకుండా జాగ్రత్తపడాలి.

► పిల్లల ఆసుపత్రుల్లో కరోనా బాధిత చిన్నారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లుండాలి. పిల్లలకు కరోనా చికిత్స అందిస్తున్నప్పుడు వారి తల్లిదండ్రులను కూడా అనుమతించవచ్చు.

► పిల్లలకు కరోనా సోకినప్పటికీ చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. కొందరిలో స్వల్ప లక్షణాలే బయటపడుతున్నాయి. ఇలాంటివారు ఇంట్లోనే తల్లిదండ్రుల సంరక్షణలోనే కోలుకుంటున్నారు. లక్షణాలున్న పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు భావిస్తే ఆసుపత్రికి తరలించాలి.
 

► ఇంట్లో చికిత్స పొందుతున్న కరోనా బాధిత చిన్నారులకు ఆశా వర్కర్ల సేవలు అవసరం.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

17-06-2021
Jun 17, 2021, 03:08 IST
ఎందుకు? ఎప్పుడు? ఎలా? కరోనా వ్యాక్సిన్‌ కోవిషీల్డ్‌ రెండు డోసుల వ్యవధిపై సామాన్య జనానికి వస్తున్న సందేహాలివి.   మొదటి డోసు తీసుకున్న...
17-06-2021
Jun 17, 2021, 03:05 IST
పర్యవేక్షణ చాలా ముఖ్యం  కేసులు తగ్గినప్పుడు కాస్త రిలాక్స్‌ మూడ్‌ వస్తుంది. ఇలాంటి సమయంలో కలెక్టర్లు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి....
16-06-2021
Jun 16, 2021, 11:58 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అతి త్వరలోనే మరో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకొచ్చే విషయంలో  సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) గుడ్‌...
16-06-2021
Jun 16, 2021, 10:04 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. అయితే మంగళవారంతో పోల్చితే.. దేశంలో స్వల్పంగా కరోనా కేసులు పెరిగాయి. భారత్‌లో...
16-06-2021
Jun 16, 2021, 08:45 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ విధించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాన్నిచ్చాయి. ప్రజలు మాస్క్‌లు ధరించడం,...
16-06-2021
Jun 16, 2021, 08:14 IST
సాక్షి, మంచిర్యాలటౌన్‌: ఏడాదిన్నరగా కరోనా మహమ్మారి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే గర్భం దాల్చిన వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది....
16-06-2021
Jun 16, 2021, 07:01 IST
న్యూఢిల్లీ: రెండో వేవ్‌లో పిల్లలు, యువత అధికంగా ప్రభావితమయ్యారన్న వాదనను కేంద్ర ఆరోగ్య శాఖ తోసిపుచ్చింది. 1 నుంచి 20...
16-06-2021
Jun 16, 2021, 06:38 IST
న్యూయార్క్‌: చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా వైరస్‌ లీకయిందని, దీనిపై మరింత లోతైన విచారణ అవసరమని అమెరికా సహా...
16-06-2021
Jun 16, 2021, 04:26 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నెగెటివ్‌ వచ్చిన అనంతరం మహమ్మారితో పోరాటం పూర్తయినట్లేనా అంటే... కాదంటున్నారు నిపుణులు. కరోనా నుంచి కోలుకున్న...
16-06-2021
Jun 16, 2021, 04:18 IST
సాక్షి, అమరావతి: భవిష్యత్తులో కరోనాకు చెక్‌ పెట్టేందుకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తామని.. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా అధిగమించేలా ఏర్పాట్లుచేయాలని...
16-06-2021
Jun 16, 2021, 02:59 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. కట్టుదిట్టమైన కర్ఫ్యూ మూడు రోజులకు ఒకసారి...
15-06-2021
Jun 15, 2021, 20:14 IST
డెహ్రాడూన్‌: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉదృతి కాస్త తగ్గింది. గడిచిన రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా సుమారు మూడు లక్షల...
15-06-2021
Jun 15, 2021, 20:10 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1556 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం సాయంత్రం...
15-06-2021
Jun 15, 2021, 18:51 IST
కోల్‌కతా: కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నాకా కొందరు తమ శరీరంలో అయస్కాంత లక్షణాలు కనిపిస్తున్నాయంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఇటీవలే నాసిక్‌కు చెందిన...
15-06-2021
Jun 15, 2021, 17:50 IST
సాక్షి, అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో  96,153 మంది సాంపిల్స్‌ పరిశీలించగా.. కొత్తగా 5,741 కరోనా కేసులు బయటపడ్డాయి....
15-06-2021
Jun 15, 2021, 12:59 IST
వాషింగ్టన్‌: దేశీయ పార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ సంస్థ కోవాగ్జిన్‌ టీకాను అభివృద్ది చేసిన సంగతి తెలిసిదే. అయితే తాజాగా కోవాగ్జిన్‌ తీసుకున్న భారతీయ...
15-06-2021
Jun 15, 2021, 11:17 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌ వేవ్‌ను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ కాలంలో దేశంలో దాదాపు 73 శాతం వృద్ధులపై...
15-06-2021
Jun 15, 2021, 10:16 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గింది. భారత్‌లో...
15-06-2021
Jun 15, 2021, 09:40 IST
న్యూఢిల్లీ: పీఎం కేర్స్‌ నిధుల నుంచి దేశంలోని పలు జిల్లాల్లో 850 ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్‌డీఓ చీఫ్‌...
15-06-2021
Jun 15, 2021, 09:17 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి ఢిల్లీకి వచ్చే వారికి ఇకపై ఆర్టీ–పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు అవసరం లేదని ఢిల్లీ...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top