జీ మ్యాట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలో మరో విభాగం

GMAT Online Exam Adds Analytical Writing Assessment Section - Sakshi

న్యూఢిల్లీ: గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (జీమ్యాట్‌) ఆన్‌లైన్‌ పరీక్షా విధానంలో గతంలో తొలగించిన అనలిటికల్‌ రైటింగ్‌ అసెస్‌మెంట్‌(ఏడబ్ల్యూఏ) విభాగాన్ని తిరిగి చేర్చారు. పరీక్షార్థులకు అదనపు సౌలభ్యాన్ని అందించడంతోపాటు, వాస్తవ పరీక్షా కేంద్రం అనుభూతినిచ్చేందుకు చేపట్టిన పలు చర్యల్లో ఇది కూడా ఒకటని జీమ్యాట్‌ను నిర్వహించే గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ కౌన్సిల్‌(జీమ్యాక్‌) తెలిపింది. వేగంగా మారుతున్న మార్కెటింగ్‌ అవసరాలకు అనుగుణంగా ఏడబ్ల్యూఏ వంటి జీమ్యాట్‌లోని కొన్ని అంశాలను ప్రారంభ ఆన్‌లైన్‌ పరీక్షలో తొలగించినట్లు జీమ్యాక్‌ అధికారులు తెలిపారు.

కోవిడ్‌–19 మహమ్మారి కారణంగా జీమ్యాట్‌ను ఆన్‌లైన్‌ ద్వారా జీమ్యాక్‌ చేపడుతోంది. ఇప్పటి వరకు 150 దేశాలు, ప్రాంతాల్లో 45 వేలకుపైగా పరీక్షలు చేపట్టినట్లు జీమ్యాక్‌ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2,300 బిజినెస్‌ స్కూళ్లలో ప్రవేశాలకు జీమ్యాట్‌నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఎంబీఏ ప్రవేశాలు ప్రతి పదింటిలో తొమ్మిదింటికి జీమ్యాట్‌ స్కోరే ఆధారం. జీమ్యాక్‌ అనే లాభాపేక్ష లేని సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 223 గ్రాడ్యుయేట్‌ బిజినెస్‌ స్కూళ్లున్నాయి. 

చదవండి:
పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు.. జీతం ఎంతంటే!

ఆపిల్‌ కంప్యూటర్‌ ఖరీదు రూ.11కోట్లు?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top