
సెపె్టంబర్ 15 తుది గడువు
ఆదాయపు పన్ను విభాగం వెల్లడి
న్యూఢిల్లీ: 2025–26 అసెస్‌మెంట్ ఇయర్‌కి సంబంధించి సెపె్టంబర్ 13 (శనివారం) నాటికి ఆరు కోట్ల పైగా రిటర్నులు దాఖలైనట్లు ఆదాయపు పన్ను విభాగం తెలిపింది. తుది గడువు (సెపె్టంబర్ 15 గడువు) దగ్గర పడుతుండడంతో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని పేర్కొంది. ‘‘ఆరు కోట్ల మైలురాయిని చేరుకునేందుకు సహకరించిన పన్ను చెల్లింపుదారులు, పన్ను నిపుణులకు ధన్యవాదాలు. రిటర్నుల ఫైలింగ్‌లో పన్ను చెల్లింపుదారులకు సాయంగా హెల్ప్ డెస్‌్కలు, వారమంతా ఇరవై నాలుగ్గంటలూ పనిచేస్తాయి.
కాల్స్, లైవ్ చాట్స్, వెబ్‌ఎక్స్ సెషన్లు, ఎక్స్ ద్వారా హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంటుంది’’ అని తన ఎక్స్ అకౌంట్ పోస్ట్ ద్వారా తెలిపింది. రిటర్నులు ఇంకా సమర్పించని పన్ను చెల్లింపుదారులు వెంటనే దాఖలు చేయాలని సూచించింది. చివరి నిమిషం వరకు వేచిచూడొద్దని కోరింది. ఆదాయపన్ను శాఖ ఇప్పటికే జూలై 31వ తేదీ నుంచి సెపె్టంబర్ 15వ తేదీ వరకు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. గత అసెస్‌మెంట్ సంవత్సరంలో 2024 జులై 31 నాటికి 7.28 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయి. అంతకుముందు ఏడాది 6.77 కోట్ల రిటర్నుల ఫైలింగ్‌తో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన 7.5% పెరిగాయి.