ఫ్యాక్టరీలో భారీ పేలుడు... 13 మంది మృతి | UP Factory Explosion Near Delhi Some Member Dead | Sakshi
Sakshi News home page

యూపీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు... 13 మంది మృతి

Published Sun, Jun 5 2022 1:52 PM | Last Updated on Sun, Jun 5 2022 2:04 PM

UP Factory Explosion Near Delhi Some Member Dead - Sakshi

లక్నో: ఢిల్లీ సమీపంలోని యూపీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుమారు 13 మంది మృతి చెందగా.. ఆరుగురు గాయపడనట్లు తెలిపారు. ఈ ఘటన పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలోని ఫ్యాక్టరీలో చోటు చేసుకుంది. ఆ సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 30 మంది ఇన్నారని పోలీసులు తెలిపారు. ఈ పేలుడు తాకిడికి చుట్టుపక్కల ఉన్న కొన్ని ఫ్యాక్టరీల పైకప్పులు దెబ్బతిన్నాయని చెప్పారు. ఐతే ఈ ఫ్యాక్టరీకి ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కోసం లైసెన్స్ ఇస్తే ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం బాణసంచా తయారు చేస్తున్నామని చెబుతుండటం గమనార్హం.

దీంతో పోలీసులు ఫ్యాక్టరీ యజమాని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఈ మేరకు ఈ ఘటనలో చనిపోయిన మృతుల పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు గల కారణాల గురించి ప్రత్యేక నిపుణులతో సత్వరమే విచారణ జరపించాలని ముఖ్యమంత్రి యోగి ఆదేశించారు. అంతేకాదు బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సహయం అందించాలని ఆదిత్యనాథ్ జిల్లా పరిపాలనాధికారులను కోరారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ దృశ్యాలు ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతున్నాయి.

(చదవండి: ఢిల్లీలో భానుడి భగభగలు... ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement