అరబ్‌ ఎమిరేట్స్‌ అధికారి రేంజ్‌లో కలరింగ్‌.. చివరికి బిల్లు కట్టకుండా.. | Delhi Man Arrest Five Star Hotel Leaving With Out Paying Bill Rs 23 Lakhs | Sakshi
Sakshi News home page

అరబ్‌ ఎమిరేట్స్‌ అధికారి రేంజ్‌లో కలరింగ్‌ ..చివరికి బిల్లు కట్టకుండా..

Jan 22 2023 3:17 PM | Updated on Jan 22 2023 3:17 PM

Delhi Man Arrest Five Star Hotel Leaving With Out Paying Bill Rs 23 Lakhs - Sakshi

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కి చెందిన ‍ప్రభుత్వాధికారిలా నటించి ఓ ఫైస్టార్‌ హోటల్‌నే మోసం చేశాడు. ఈఘటన దేశ రాజధాని ఢిల్లీలో  చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వాధికారిలా నటించి దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ప్రముఖ లీలా హోటల్‌ ఫ్యాలస్‌ అనే ఫైస్టార్‌ హోటల్‌లో బస చేశాడు. ఆ హోటల్‌ మేనేజర్‌ అనుపమదాస్‌ గుప్తాకి ఒక నకిలీ బిజినెస్‌ కార్డుని చూపించి దాదాపు మూడు నెలలు పాటు అక్కడే ఉన్నాడు.

అతను ఆగస్టు1, 2022 నుంచి నవంబర్‌ 20, 2022 వరకు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత ఉన్నటుండి హోటల్‌ బిల్‌ చెల్లించకుండా ఆ హోటల్‌లో ఉన్న విలువైన వస్తువులను దొంగలించి పరారయ్యాడు. అతను సుమారు రూ. 23 లక్షల బిల్లు కట్టకుండా పరారయ్యాడు. దీంతో మేనేజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు నిందితుడు గురించి తీవ్రంగా గాలించి అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తి కర్ణాటకలోని దక్షిణ కన్నడకు చెందిన 41 ఏళ్ల మహ్మద్‌ షరీఫ్‌గా గుర్తించారు. అతను సమర్పించిన చెక్కు కూడా బౌన్స్‌ అయ్యిందని, అతను ఉద్దేశపూర్వకంగానే హోటల్‌ని మోసం చేసేందుకు యత్నించినట్లు విచారణలో తేలిందని పోలీసలు వెల్లడించారు.

(చదవండి: షాకింగ్‌ ఘటన: కారుతో ఢీకొట్టి..ఎనిమిది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి...)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement