అయ్యో తాతా: రోడ్డుపైనే మృతదేహం... చివరికి | Sakshi
Sakshi News home page

అయ్యో తాతా: రోడ్డుపైనే మృతదేహం.. పోలీసుల జోక్యంతో

Published Wed, Apr 7 2021 8:41 AM

Dalit Man Cremation Stopped Over Burial Ground Land Issue Karnataka - Sakshi

దొడ్డబళ్లాపురం: దళితుడి అంత్యక్రియలకు ఆటంకం కలగడంతో బంధువులు మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ఆందోళనకు దిగారు. కర్ణాటకలోని చెన్నపట్టణ తాలూకా హనుమాపురదొడ్డి గ్రామానికి చెందిన నాథయ్య(75)అనే దళితుడు అనారోగ్యంతో మృతిచెందాడు. గ్రామ శివారులోని శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్లగా కొందరు అడ్డుకున్నారు. దీంతో దళితుడి శవం ఉన్న వాహనాన్ని రోడ్డుపైనే నిలిపి ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా, దళితుల కోసం శ్మశానం భూమి కేటాయించాలని డిమాండు చేశారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి శవ సంస్కారానికి వేరే చోట అవకాశం కల్పించారు. శ్మశానానికి 60 ఏళ్ల క్రితం గ్రామ పెద్ద స్థలం దానం చేశారని,  ఆ భూమి తమకు కావాలని వారసులు న్యాయ పోరాటం ప్రారంభించడం వల్ల శ్మశానంలో శవ సంస్కారానికి వారు అనుమతించడంలేదని అధికారులు పేర్కొన్నారు.

చదవండి: ఇక్కడ పాతిపెట్టొద్దు.. అయ్యో బిడ్డా..

Advertisement

తప్పక చదవండి

Advertisement