ఘనంగా జన్మాష్టమి వేడుకలు.. ప్రధాని మోదీ శుభాకాంక్షలు | Dahi Handi Krishna Janmashtami Celebration | Sakshi
Sakshi News home page

ఘనంగా జన్మాష్టమి వేడుకలు.. ప్రధాని మోదీ శుభాకాంక్షలు

Aug 16 2025 9:21 AM | Updated on Aug 16 2025 1:30 PM

Dahi Handi Krishna Janmashtami Celebration

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జన్మాష్టమి సందర్బంగా ‘దహీ హండీ’ (ఉట్టికొట్టే ఉత్సవం) వేడుకలకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.
 

కృష్ణుడు వెన్న దొంగిలించినందుకు గుర్తుగా ఈ వేడుకలను నిర్వహిస్తుంటారు. దహి హండీ మహోత్సవంలో పాల్గొనేందుకు స్పానిష్ క్యాస్టెల్లర్ల బృందం ఇప్పటికే మహారాష్ట్ర చేరుకుంది.

మరోవైపు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గల ఇస్కాన్ ఆలయంలో భక్తులు శ్రీకృష్ణుడిని, రాధాదేవిని దర్శనం చేసుకునేందుకు తరలివస్తున్నారు. మధురలోని శ్రీ కృష్ణుని ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు.

ప్రధాని మోదీ ‘ఎక్స్‌’లో దేశ ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ..‘నమ్మకం, ఆనందం, ఉత్సాహం నడుమ జరిగే ఈ  ఉత్సవం అందరి జీవితాల్లో కొత్త శక్తిని,  ఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటున్నాను.. జై శ్రీ కృష్ణ’అని రాశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement