
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు జాతినుద్దేశించి ప్రసంగం చేయనున్నారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. అయితే, దేశంలో రేపటి నుంచి(సెప్టెంబర్ 22వ తేదీ) జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి రానున్న నేపథ్యంలో మోదీ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉండగా.. జీఎస్టీ మండలి ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబుల బదులుగా రెండు శ్లాబులు చేసింది. ఇందులో ఒకటి 5% కాగా రెండోది 18%. దీని ప్రకారం 12%, 28% పన్ను శ్లాబులు ఇకపై ఉండవు. దీంతో.. చాలా వస్తువులు, వాహనాలు పలు వాటిపై ధరలు తగ్గే అవకాశం ఉంది.
Prime Minister Narendra Modi will address the nation today at 5 pm. pic.twitter.com/YFJc7fLdVu
— ANI (@ANI) September 21, 2025