సరితకు ఆమె భర్తకు కూడా కరోనా

Corona Virus: Boxer Sarita Devi Tested Corona Positive - Sakshi

సాక్షి, ఇంఫాల్‌: ప్రముఖ ఇండియన్‌ బాక్సర్‌ లైశ్రమ్ సరితా దేవి, ఆమె భర్త కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోమవారం ప్రకటించారు. గత మూడు రోజులుగా తను జ్వరం, కండరాల నొప్పితో బాధపడ్డారని, దీంతో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు చెప్పారు. కోవిడ్‌ పరీక్ష ఫలితాల్లో తనకు పాజిటివ్‌గా తెలిందని తెలిపారు. దీంతో తన భర్త, కుమారుడు సైతం కరోనా‌ పరీక్షలు చేయించుకోగా తన భర్తకు పాజిటివ్‌ రాగా.. తన కుమరుడి నెగిటివ్‌ వచ్చినట్లు సరిత తెలిపారు.
(చదవండి: ఒకే రోజు కోలుకున్న 7,866 మంది)

దేశంలో రోజు రోజు కరోనా వైరస్ మరింత విజృంభిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 57,982 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 26 లక్షలు దాటింది. తాజాగా 941 మంది కరోనాతో మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 50,921కి చేరింది. నేడు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసులతో కలిసి మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 26,47,664 కు చేరుకుంది. ప్రస్తుతం 6,76,900 మంది వైరస్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 19,19,843 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 7 లక్షల 30 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంతో.. మొత్తం పరీక్షల సంఖ్య మూడు కోట్లు దాటింది. (చదవండి: ప్రతి 3 నిమిషాలకు ఓ ఇద్దరు..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top