ప్రాణప్రతిష్ఠకు ముందు ఇంటిలో సీఎం యోగి పూజలు! | Sakshi
Sakshi News home page

Ayodhya Ram Mandir: ప్రాణప్రతిష్ఠకు ముందు ఇంటిలో సీఎం యోగి పూజలు!

Published Mon, Jan 22 2024 9:30 AM

CM Yogi Adityanath Remembered his Guru on Ramlala Pran Pratishtha - Sakshi

అయోధ్య రామాలయంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠకు ముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన గురువులను స్మరించుకుని, పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన సోషల్ మీడియా సైట్‌లో షేర్ చేశారు. 

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇలా రాశారు.. 'అయోధ్యధామ్‌లోని శ్రీరాముడి జన్మస్థలంలో నేడు జరుగుతున్న రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం శతాబ్ధాల పోరాట ఫలితం. ఈ సందర్భంగా దిగ్విజయ్‌నాథ్ మహరాజ్, మహంత్ అవేద్యనాథ్ మహారాజ్‌లకు ఉద్వేగభరితమైన నివాళులు అర్పిస్తున్నాను.. జై జై శ్రీ రామ్!’ అని రాశారు.
 

సీఎం యోగి మరో ట్వీట్‌లో ప్రధాని మోదీకి  ధన్యవాదాలు తెలిపారు... ‘ఇది అద్భుతమైన, మరపురాని, అతీంద్రియ క్షణం.. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో శ్రీరాముని పవిత్ర జన్మస్థలమైన అయోధ్యధామ్‌లో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. నేడు ప్రధాని నేతృత్వంలో అసంఖ్యాక రామభక్తుల నిరీక్షణకు తెరపడనుంది. భక్తి సాగరంలో మునిగిన దేశమంతా రామనామం స్మరిస్తోంది’ అని  ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: అయోధ్యకు లండన్‌ సాధ్విల బృందం!

Advertisement
 
Advertisement
 
Advertisement