bride horse riding reach grooms at residence in madhya pradesh - Sakshi
Sakshi News home page

గుర్రంపై ఊరేగుతూ మండపానికి చేరుకున్న వధువు

Feb 9 2021 7:07 PM | Updated on Feb 9 2021 7:23 PM

Bride Rode on Horse To Reach Grooms Residence In Madhya Pradesh - Sakshi

భోపాల్‌ : ఉత్తరాది పెళ్లి వేడకల్లో సాధారణంగా పెళ్లికొడుకు గుర్రంపై ఊరేగుతూ మండపానికి చేరుకుంటాడు. అది అక్కడి సాంప్రదాయం కూడానూ. అయితే మధ్యప్రదేశ్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా పెళ్లి కుమార్తె స్వయంగా గుర్రపు స్వారీ చేస్తూ మండపానికి వచ్చింది. అది కూడా పెళ్లిదుస్తుల్లో కాకుండా మోడ్రన్‌ దుస్తుల్లో వచ్చి ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియా నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాకు చెందిన దీపా వలేచా అనే యువతి వలేచా ఫ్యామిలీలోనే ఏకైక కూతురు. దీంతో చిన్పప్పటి నుంచి  ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన ఆమె తల్లిదండ్రులు గుర్రంపై స్వారీ చేయాలన్న తమ కూతురి కోరికను కూడా సంతోషంగా నెరవేర్చారు. (ఫోటో గ్రాఫర్‌ ఓవరాక్షన్‌.. వరుడి రియాక్షన్‌: వైరల్‌)

అంతేకాకుండా సమాజంలో ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదని, అబ్బాయిలకు సరిసమానంగా అమ్మాయిలకు కూడా సమాన హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. కూతురిపై అపారమైన ప్రేమతో పాటు ఆడవాళ్లు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించిన వలేచా పేరెంట్స్‌ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక పెళ్లిరోజు గుర్రపు స్వారీ చేసుకుంటూ రావాలన్న తన కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందని వధువు దీపా వలేచా పేర్కొంది. కుటుంబసభ్యుల వల్లే తన కోరిక నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది. (మాధురీ దీక్షిత్‌ను ఫిదా చేసిన యువతి )


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement