ట్రెండ్‌ సెట్‌ చేసిన పెళ్లి కూతురు.. వీడియో వైరల్

Bride Drives Husband To Her Sasuraal On Vidaai Video Goes Viral - Sakshi

కోల్‌కతా : పెళ్లి తర్వాత అమ్మాయిని అత్తారింటికి పంపే అప్పగింతల కార్యక్రమం ఎంతో ఉద్వేగభరితమైంది. పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్లే ఘట్టం ప్రతీ అమ్మాయి జీవితంలో ఎంతో మరుపురానిది. అయితే ఈ సాంప్రదాయాన్ని మరింత స్పెషల్‌గా మార్చాలనుకుంది ఓ వధువు. కోల్‌కతాకు చెందిన స్నేహ సింఘీ(28) అనే యంగ్‌ బిజినెస్‌ ఉమెన్‌...ఇటీవలె సౌగత్‌ ఉపాధ్యాయ అనే వ్యక్తిని పెళ్లాడింది. అయితే అందరి అమ్మాయిల్లానే అప్పగింతల కార్యక్రమంలో తల్లిదండ్రులను విడిచి వెళ్లేటప్పుడు ఎంతో భావోధ్వేగానికి లోనైంది. వారికి బై..బై చెబుతూ అక్కడి నుంచి కదిలింది.  వరుడిని పక్క సీట్లో కూర్చోబెట్టుకొని తానే స్వయంగా కారు నడుపుతూ అత్తారింటికి బయల్దేరింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా, కొద్ది గంటల్లోనే ఇది  వైరల్‌గా మారింది.

పెళ్లి దుస్తుల్లోనే స్టీరింగ్‌ పట్టుకున్న వధువు స్నేహను పలువురు నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పెళ్లికూతురు ట్రెండ్‌ సెట్‌ చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ కొత్త సాంప్రదాయానికి తెరతీయడంపై వధువు స్నేహ సింఘీ మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత నేనే స్వయంగా కారును డ్రైవ్‌ చేసుకుంటూ అత్తారింటికి వెళితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది.  పెళ్లికి నెల కిందట సౌగత్‌ను అడగితే,అతను ఈ ఐడియా చాలా బావుందని చెప్పాడు. అంతేకాకుండా సౌగత్ తల్లి కూడా ఇందుకు వెంటనే అంగీకరించింది. దీంతో నా కల నెలవేరింది. అని స్నేహ సంతోషం వ్యక్తం చేసింది.

చదవండి : తొలి రాత్రే షాకిచ్చిన వధువు: రాడ్‌తో భర్తను కొట్టి..
ఐఫోన్‌ ఆర్డర్‌ చేస్తే.. భారీ పార్శిల్‌‌‌

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top