థర్డ్‌ వేవ్‌కు మార్కెట్లే హాట్‌స్పాట్లా? 

Breach Of COVID-19 Norms In Markets Will Hasten Third Wave - Sakshi

ఢిల్లీలో కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పట్ల ప్రజల అలసత్వం 

షాపింగ్‌పైనే ప్రజల దృష్టి  

అలర్టయిన రాష్ట్ర ప్రభుత్వం 

కొన్ని మార్కెట్ల మూసివేతకు చర్యలు

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌లో తీవ్రంగా ప్రభావితమైన దేశ రాజధాని ఢిల్లీలో నెల రోజులుగా పరిస్థితులు కాస్త కుదుటపడుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో రోజువారీగా పాజిటివ్‌ కేసులు దాదాపు వందలోపే నమోదవుతున్నాయి. కేసుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల నమోదు కావడంతో లాక్‌డౌన్‌ సమయంలో కరోనా భయంతో ఇళ్లకే పరిమితమైన ఢిల్లీ వాసుల వ్యవహారశైలిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ, దశల వారీగా అన్‌లాక్‌ ప్రక్రియ జరుగుతున్న సమయంలో ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా మాస్క్‌ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు రద్దీ ఉండే ప్రదేశాలకు వెళ్లరాదన్న ప్రోటోకాల్స్‌ను చాలామంది తుంగలో తొక్కేస్తున్నారు. కరోనా వచ్చే ముందు ఏవిధంగా ఢిల్లీలోని మార్కెట్లు కిటకిటలాడాయో, ఇప్పుడూ అవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. వీటిని చూస్తుంటే ప్రజల్లో కరోనా పట్ల భయం ఏమాత్రం లేదన్నదని స్పష్టంగా అర్థమౌతోంది.      

దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌–అక్టోబర్‌ నెలల్లో కరోనా మూడో వేవ్‌ వస్తుందనే అంచనాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే సమయంలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కారణంగా రాబోయే కొద్ది నెలల్లో దేశంలో మూడో వేవ్‌ వచ్చే అవకాశాలున్నాయని పరిశోధకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఊహాగానాల మధ్య ప్రజలు తమ షాపింగ్‌ ఆసక్తిని ఏమాత్రం తగ్గించుకోవట్లేదనేది ఇక్కడ పరిశీలించాల్సిన అంశం. 

ఢిల్లీలో అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమై, మార్కెట్లు తెరుచుకున్నప్పటి నుంచి షాపింగ్‌కు వెళ్లే ప్రజల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. దీంతో లజ్‌పత్‌నగర్, సరోజిని నగర్, సదర్‌ బజార్‌తో సహా ఢిల్లీలోని అనేక మార్కెట్లలో కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించే విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యం, ప్రజల అలసత్వం కారణంగా ఇవి మూడో వేవ్‌కు హాట్‌స్పాట్‌లుగా మారే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. గత నెలలో జరిగిన ఒక విచారణ సందర్భంగా, ఢిల్లీ హైకోర్టు సైతం కోవిడ్‌ విషయంలో మార్కెట్లలో నెలకొన్న నిర్లక్ష్యంపై పదునైన వ్యాఖ్యలు చేసింది. దీంతో జనసాంద్రత ఎక్కువగా ఉండే జనపథ్‌ , కన్నాట్‌ ప్లేస్‌ , కరోల్‌బాగ్, సరోజిని నగర్, సదర్‌ బజార్‌ ,లజ్‌పత్‌ నగర్, చాందిని చౌక్, ఐఎన్‌ఏ మార్కెట్, పట్‌పడ్‌ గంజ్, లక్ష్మీ నగర్‌ వంటి మార్కెట్లపై ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మార్కెట్లలో ప్రజలు భౌతిక దూరం పాటించే పరిస్థితి మాత్రం కనిపించదు. ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఈ మార్కెట్లు కరోనా హాట్‌స్పాట్లుగా మారే అవకాశాలున్నాయని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్‌లాక్‌–1 ప్రకటన సందర్భంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ మార్కెట్లే కాక మంగోల్‌పురి, మధు విహార్, త్రినగర్, పహాడ్‌గంజ్‌ మెయిన్‌ బజార్, పాత ఢిల్లీ మార్కెట్, సఫ్దర్‌జంగ్‌ మార్కెట్‌ సమీపంలోని దక్షిణ ఢిల్లీ మార్కెట్, ఇండియా గేట్‌ సమీపంలోని న్యూ ఢిల్లీ మార్కెట్, కన్నాట్‌ ప్లేస్‌ ఎదురుగా ఉన్న ఎం బ్లాక్‌ మార్కెట్, డిఫెన్స్‌ కాలనీ దగ్గర ఉన్న దక్షిణ ఢిల్లీ మార్కెట్‌లలో కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించే విషయంలో ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయి. 

లజ్‌పత్‌ నగర్‌ మార్కెట్‌ మూసివేత
కోవిడ్‌ నియమాలను పాటించని కారణంగా లజ్‌పత్‌నగర్, సరోజిని నగర్‌ సహా ఇతర మార్కెట్ల మూసివేతపై ఢిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (డీడీఎంఏ) నోటీసులు జారీ చేసింది. ఈ మార్కెట్లో కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించకపోవడమే కాకుండా, వందలాది మంది విక్రేతలు మార్కెట్‌లో అక్రమంగా వస్తువులను విక్రయిస్తున్నారని స్థానిక దుకాణాదారులు ఎన్‌డీఎంసీకి లేఖ రాశారు. అదే సమయంలో ఢిల్లీలోని అన్ని జిల్లాల అధికారులకు అందుతున్న ఫిర్యాదుల మేరకు కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించని మార్కెట్లు, షాపులపై దాడి చేసి సీల్‌ చేస్తున్నారు. అయితే మూడో వేవ్‌ ఊహాగానాల నేపథ్యంలో కరోనా వ్యాప్తిని అపే విషయంలో పాలనా యంత్రాంగం, వ్యాపారస్థుల ముందు పెద్ద సవాలు ఉంది. దుకాణదారులు వ్యాపారంతో పాటు కరోనా సంక్రమణ నివారణపై దృష్టిపెట్టాలని అధికారులు సూచిస్తున్నారు. మార్కెట్లలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ఢిల్లీలో ఇప్పటివరకు 14,34, 608 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 14,08,699 మంది రోగులు నయమయ్యారు. రికవరీ రేటు 98.18 శాతంకు చేరింది. అదే సమయంలో, మృతుల సంఖ్య 24,997కు పెరిగింది. ఢిల్లీలో కంటైన్మెంట్‌ జోన్ల సంఖ్య 695కి చేరింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

06-07-2021
Jul 06, 2021, 03:43 IST
సెప్టెంబర్‌ నెల మధ్య నాటికే కరోనా మూడో వేవ్‌ పతాక స్థాయికి చేరొచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్‌ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్త...
05-07-2021
Jul 05, 2021, 20:49 IST
సాక్షి, అమరావతి: కరోనా సోకిన ఉద్యోగులకు 20 రోజుల సెలవు మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది....
04-07-2021
Jul 04, 2021, 08:12 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో పంపిణీ చేసిన వ్యాక్సిన్‌ డోస్‌ల సంఖ్య 34.46 కోట్లు దాటింది. శనివారం...
04-07-2021
Jul 04, 2021, 00:02 IST
కరోనా నిర్ధారణ కోసం ఓ పుల్లలాంటి పరికరంతో ముక్కులోంచి స్వాబ్‌ సేకరించి, దాని సహాయంతో కరోనా ఉందని తెలుసుకోవడం జరుగుతుంది....
03-07-2021
Jul 03, 2021, 19:20 IST
కోల్‌కతా: నర్సు పక్కన ఉండగానే తృణముల్‌ పార్టీకి చెందిన కౌన్సిలర్‌ వ్యాక్సిన్‌ వేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన కోల్‌కతాకు...
03-07-2021
Jul 03, 2021, 14:54 IST
సాక్షి బెంగళూరు: రాష్ట్రంపై పంజా విసిరిన కరోనా మహమ్మారి నెమ్మదిస్తోంది. కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టగా డిశ్చార్జ్‌ల సంఖ్య...
03-07-2021
Jul 03, 2021, 14:31 IST
సంక్షోభంలో హోటల్‌ రంగం
03-07-2021
Jul 03, 2021, 10:13 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా కేసులు తగ్గడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు సాధారణ వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు ప్రారంభిస్తున్నాయి. సెకండ్‌...
03-07-2021
Jul 03, 2021, 09:21 IST
డెల్టా వేరియంట్ విషయంలో ఇది 65.2 శాతం సామర్థ్యంతో పని చేస్తుంది
03-07-2021
Jul 03, 2021, 08:33 IST
సాక్షి, హైదరాబాద్‌: కోవాగ్జిన్, కోవీషీల్డ్‌ వ్యాక్సిన్‌లకు సంబంధించిన ఇండెంట్‌ సమాచారం తమ వద్ద లేదని కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ...
02-07-2021
Jul 02, 2021, 19:01 IST
లక్నో: అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మరిన్ని నిబంధనలు సడలించింది. సినిమా హాళ్లు, మల్టీపెక్సులు, క్రీడా మైదానాలు, జిమ్‌లు...
02-07-2021
Jul 02, 2021, 17:54 IST
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో కోవిడ్‌ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 3,203 కరోనా...
02-07-2021
Jul 02, 2021, 11:16 IST
సాక్షి ముంబై: ‘‘ప్రపంచాన్ని హడలెత్తించిన కరోనా మహమ్మారి లక్షలాది మందిని బలి తీసుకుంది. కానీ, మా ఆసుపత్రిలో కరోనాతో ఒక్క...
02-07-2021
Jul 02, 2021, 09:10 IST
న్యూఢిల్లీ/హైదరాబాద్‌: సింగిల్‌ డోస్‌ కోవిడ్‌ టీకా ‘స్పుత్నిక్‌ లైట్‌’ అత్యవసర వినియోగానికి డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతి...
02-07-2021
Jul 02, 2021, 08:16 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మూడో వేవ్‌ వస్తుందని జరుగుతున్న పెద్ద ఎత్తున ఊహాగానాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండి, కోవిడ్‌...
01-07-2021
Jul 01, 2021, 11:03 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గత మూడు రోజులుగా తగ్గుముఖం పడుతున్న కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. మరణాలు కూడా మరోసారి 1000...
01-07-2021
Jul 01, 2021, 08:48 IST
ఏడాదిన్నర కింద కరోనా వైరస్‌ దాడి మొదలైంది. ఏడాది కింద మొదటి వేవ్‌తో కలకలం సృష్టించింది. ఇటీవల రెండో వేవ్‌తో...
01-07-2021
Jul 01, 2021, 03:27 IST
ఏడాదిన్నర కింద కరోనా వైరస్‌ దాడి మొదలైంది. ఏడాది కింద మొదటి వేవ్‌తో కలకలం సృష్టించింది. ఇటీవల రెండో వేవ్‌తో...
01-07-2021
Jul 01, 2021, 02:17 IST
సాక్షి, అమరావతి: టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌ ద్వారా కరోనా కట్టడి వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేసిన ఏపీకి ప్రజాభిప్రాయ సేకరణలో...
01-07-2021
Jul 01, 2021, 01:34 IST
న్యూఢిల్లీ: పురుషులు, మహిళల్లో వ్యంధ్యత్వానికి (ఇన్‌ఫెర్టిలిటీ) కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కారణమవుతోందన్న వాదనలో ఏమాత్రం వాస్తవం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top