మాస్క్‌ ఎఫెక్ట్‌: రూ.30 కోట్ల ఆదాయం

BMC Has Collected Rs 305000000 From People Not Wearing Masks - Sakshi

మాస్క్‌ నియమం ఉల్లంఘనతో బీఎంసీకి భారీ ఆదాయం

మంగళవారం ఒక్క రోజులోనే రూ. 45.95 లక్షలు వసూలు

ముంబై: తగ్గిందనుకున్న కరోనా మరోసారి పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కోవిడ్‌ కేసులు ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. రంగంలోకి దిగిన ప్రభుత్వం మరోసారి కఠినమైన ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో మాస్క్‌ ధరించని వారికి జరిమానా విధిస్తోంది. ఈ క్రమంలో బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) నిన్న ఒక్క రోజులోనే ముంబైలో జరిమానాల రూపంలో 29లక్షల రూపాయలు వసూలు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించని 14,600 మంది నుంచి ఈ మొత్తం వసూలు చేసినట్లు బీఎంసీ వెల్లడించింది.

రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం మొత్తం మీద 22,976 మంది నుంచి 45.95 లక్షల రూపాయల జరిమానా వసూలు చేసినట్లు బీఎంసీ ప్రకటించింది. ముంబైలో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి బీఎంసీ కమిషనర్ ఐఎస్ చాహల్ కఠినమైన చర్యలు ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఈ మొత్తం వసూలు చేయడం గమనార్హం. బీఎంసీ  తాజా మార్గదర్శకాల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించడం తప్పనిసరి. ఈ నియమాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే  వారికి 200 రూపాయల జరిమానా విధిస్తున్నారు. ఇక 2020 ఏడాది మొత్తం మీద మాస్క్‌ ధరించని వారి నుంచి ఏకంగా 30,50,00,000 రూపాయలు వసూలు చేసినట్లు బీఎంసీ తెలిపింది.

మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ముంబై పోలీస్,సెంట్రల్, వెస్ట్రన్ రైల్వే వంటి వివిధ ఏజెన్సీలు మాస్క్‌ ధరించని వారి నుంచి వసూలు చేసిన జరిమానాల మొత్తానికి సంబంధించిన డాటాను బీఎంసీ విడుదల చేయడం ప్రారంభించింది. సబర్బన్ రైల్వే నెట్‌వర్క్‌న్‌ను నడుపుతున్న సెంట్రల్, వెస్ట్రన్ రైల్వేలు ఇప్పటివరకు రూ. 91,800 రూపాయలు జరిమానాగా వసూలు చేశాయి.

బీఎంసీ గణాంకాల ప్రకారం సంస్థ ప్రతి రోజు మాస్క్‌ ధరించని సుమారు 13,000 మంది నుంచి రోజుకు సగటున 25 లక్షల రూపాయలకు పైగా వసూలు చేస్తోంది. జరిమానా కట్టలేని వారితో వీధులు ఊడ్చడం వంటి పనులు చేపిస్తోంది.పెరుగుతున్న కోవిడ్-19 కేసులను దృష్టిలో ఉంచుకుని గత వారం, ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తాజా ఆంక్షలను ప్రకటించారు. లాక్‌డౌన్‌ విధించాలా వద్దా అని నిర్ణయించడానికి వచ్చే ఎనిమిది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తుందని ఠాక్రే చెప్పారు.

చదవండి: 
ఇలానే ఉంటే మరో 15 రోజుల్లో లాక్‌డౌన్‌: సీఎం
పొంచి ఉన్న ‘మహా’ ముప్పు!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

07-05-2021
May 07, 2021, 21:58 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ వైద్యానికి మరో కీలక జీవోను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 50శాతం బెడ్లను కోవిడ్‌...
07-05-2021
May 07, 2021, 20:57 IST
రెండో దశలో కరోనా మహమ్మారి విజృంభిస్తోందని , థర్డ్‌ వేవ్‌ను  తప్పదంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన  కేంద్ర ప్రభుత్వ అత్యున్నత...
07-05-2021
May 07, 2021, 20:51 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతుంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో కొత్తగా 5,559 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. 41...
07-05-2021
May 07, 2021, 20:40 IST
అమరావతి: ఏపీలోని ఆస్పత్రుల్లో విజిలెన్స్‌ దాడులు కొనసాగుతున్నాయి.అక్రమాలకు పాల్పడుతున్న నాలుగు ఆస్పత్రులపై అధికారులు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ...
07-05-2021
May 07, 2021, 19:32 IST
సాక్షి, అమరావతి : గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,00,424 కరోనా పరీక్షలు నిర్వహించగా 17,188 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది....
07-05-2021
May 07, 2021, 19:01 IST
సాక్షి,న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ సోకిన తరువాత కోలుకోవడం ఒక ఎత్తయితే.. కోలుకున్న తరువాత మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం మరో ఎత్తు....
07-05-2021
May 07, 2021, 18:51 IST
గురజాల: గుంటూరు జిల్లా గురజాల మండలం మాడుగుల పీహెచ్‌సీలో పనిచేస్తోన్న డాక్టర్‌ జి.పద్మావతి కోవిడ్‌ వారియర్‌గా కరోనా రోగులకు నిర్విరామ...
07-05-2021
May 07, 2021, 17:48 IST
సాక్షి, విజయవాడ: దేశ వ్యాప్తంగా జనవరి 16న వ్యాక్సినేషన్ పక్రియను కేంద్రం ప్రారంభించిందని.. వ్యాక్సినేషన్‌ విషయంలో మనం ఆదర్శంగా నిలిచామని ఏపీ వైద్యారోగ్య...
07-05-2021
May 07, 2021, 17:46 IST
న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించ‌డంతో పాటు.. అంత‌రాష్ట్ర ప్ర‌యాణాల‌పై...
07-05-2021
May 07, 2021, 17:15 IST
సాక్షి, అమరావతి: కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలకు ఆరోగ్యశ్రీ సంజీవనిలా పనిచేస్తోంది. ఆరోగ్యశ్రీ పథకంతో రాష్ట్రంలోని పేద ప్రజలకు ఉచితంగా...
07-05-2021
May 07, 2021, 16:51 IST
ఢిల్లీ: ప్ర‌పంచాన్ని బెంబెలేత్తించిన క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి కోసం చాలా దేశాలు వ్యాక్సిన్ల‌ను అభివృద్ధి చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. మ‌న...
07-05-2021
May 07, 2021, 16:36 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ కట్టడే లక్ష్యంగా రాష్ట్రంలో  కర్ఫ్యూ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ప్రజలు కూడా స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. ఉద్యోగుల...
07-05-2021
May 07, 2021, 15:40 IST
ఢిల్లీ: రాష్ట్రాల వారీగా రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను శుక్రవారం కేంద్రం కేటాయించింది. ఈ నెల 16 వరకు కేటాయింపులు చేస్తూ కేంద్రం...
07-05-2021
May 07, 2021, 15:01 IST
శివాజీనగర/యశవంతపుర: ‘అయ్యా నా భర్తను కాపాడండి.. కరోనాతో చనిపోయేలా ఉన్నాడు.. ఏదైనా ఆస్పత్రిలో బెడ్‌ ఇప్పించండి..’ అంటూ ఒక మహిళ...
07-05-2021
May 07, 2021, 14:14 IST
ఆర్థికంగా లెక్కలు వేసుకుంటూ కూర్చుంటే మహా విషాదకర సంక్షోభంలోకి దేశం వెళ్తుంది
07-05-2021
May 07, 2021, 13:42 IST
ఎన్‌440కే అంత ప్రమాదం కాదని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. కేరళ లాంటి రాష్ట్రాల్లో ఎన్‌440కే స్ట్రెయిన్‌.. చాలా రోజుల నుంచే ఉందని...
07-05-2021
May 07, 2021, 10:41 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస‍్తోంది. రెండో దశ ఉధృతి కొనసాగుతోంది. మహమ్మారిని కట్టడికి ప్రయత్నాలు ఫలించడం లేదు. దేశంలో మరోసారి నాలుగు లక్షలకు...
07-05-2021
May 07, 2021, 10:32 IST
మొట్టమొదటి సారి వెండితెర మీద ఆయన గొంతు పాడిన పాటకే నేను నర్తించాననే విషయం, ఆయనతో నాకు ఒక అనిర్వచనీయమైన...
07-05-2021
May 07, 2021, 10:22 IST
బాగేపల్లి/కర్ణాటక: బాగేపల్లి తాలూకాలోని దేవరెడ్డిపల్లి గ్రామానికి చెందిన డి.ఎస్‌. నాగిరెడ్డి (54), అతని కుమారుడు సుబ్బారెడ్డి(29)ని కరోనా పొట్టనబెట్టుకుంది. పరగోడు...
07-05-2021
May 07, 2021, 10:04 IST
సాక్షి, సిద్దిపేట: కరోనా మహమ్మారితో ప్రజలు అతలాకుతలం అవుతున్న వేళ.. సిద్దిపేట జిల్లా ప్రజానీకానికి మంత్రి హరీశ్‌రావు శుభవార్త అందించారు....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top