పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీలో నేడు యూసీసీ బిల్లు! | Bengal will bring strict anti-conversion law, implement UCC | Sakshi
Sakshi News home page

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీలో నేడు యూసీసీ బిల్లు!

Jun 29 2026 4:58 AM | Updated on Jun 29 2026 4:58 AM

Bengal will bring strict anti-conversion law, implement UCC

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమయ్యింది. సోమవారమే అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. మతంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత వంటి విషయాల్లో ప్రజలందరికీ ఒకే చట్టాన్ని వర్తింపజేయడమే యూసీసీ ఉద్దేశం. 

పౌరులందరికీ ఒకే రకమైన పౌర చట్టాలు ఉండాలని బీజేపీ చెబుతోంది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే యూసీసీ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపజేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి సువేందు వెల్లడించారు. గుజరాత్, ఉత్తరాఖండ్, అస్సాం  తరహాలోనే ఈ చట్టాన్ని పశ్చిమ బెంగాల్‌లోనూ అమలు చేస్తామని ప్రకటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement