లాయర్‌ మమతా వివరాలు ఇవ్వండి: బీసీఐ | Bar Council of India seeks details of Mamatas Lawyer practice | Sakshi
Sakshi News home page

లాయర్‌ మమతా వివరాలు ఇవ్వండి: బీసీఐ

May 14 2026 6:55 PM | Updated on May 14 2026 7:56 PM

Bar Council of India seeks details of Mamatas Lawyer practice

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ న్యాయవాది దుస్తులలో కలకత్తా హైకోర్టు ముందు హాజరైన కొన్ని గంటల తర్వాత  ఆమె లాయర్‌ వివరాలను ఇవ్వాలంలూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ).. రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌కు లేఖ రాసింది. న్యాయవాదిగా నమోదు, ప్రాక్టీస్ హోదాకు సంబంధించిన వివరాలను కోరింది. 

అంతకుముందు మమతా బెనర్జీ న్యాయవాది దుస్తులలో కోల్‌కత్తా హైకోర్టు ముందు హాజరై, బెంగాల్‌లో ఎన్నికల అనంతర హింసకు సంబంధించిన ఒక కేసులో వాదనలు వినిపించారు. 

దాంతో మమతా బెనర్జీ మరోసారి హైలైట్‌ అయ్యారు. దీనిలో భాగంగా ఆమె న్యాయవాది వృత్తికి సంబంధించిన అ‍న్ని వివరాలను తమకు సమర్పించాలని రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ను ఆదేశించింది బార్‌ కౌన్సిల్‌  ఆఫ్‌ ఇండియా.  ఈ అంశానికి సంబంధించి మే 16వ తేదీ లోగా అంటే శనివారంలోపు ‘లాయర్‌ మమతా’ పూర్తి వివరాలను ఇవ్వాలని స్పష్టం చేసింది.  

ఈ మేరకు  స్టేట్ బార్ కార్యదర్శికి లేఖ రాసింది బీసీఐ.  మమతా లాయర్‌ దుస్తుల్లో హైకోర్టు ముందు హాజరైన విషయం మీడియా ద్వారా తమ దృష్టికి వచ్చిందని దీనికి సంబంధించిన వివరాలను ఇవ్వాలని కోరింది బీసీఐ. 

కాగా, ఇటీవలే పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల్లోమాజీ సీఎం మమతా బెనర్జీ ఘోర ఓటమి చవిచూశారు. అయితే ఓ కీలక కేసుకు సంబంధించి ఆమె హైకోర్టుకు హాజరైన క్రమంలో మాజీ సీఎం కాస్తా.. లాయర్‌ మమతాగా అవతారమెత్తారని జనం అనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement