నీకు 21, నాకు 43.. ఓ ఆడిటర్‌ ప్రేమ వివాహం | Auditor love marriage In Tamil Nadu | Sakshi
Sakshi News home page

నీకు 21, నాకు 43.. ఓ ఆడిటర్‌ ప్రేమ వివాహం

Apr 10 2025 9:29 AM | Updated on Apr 10 2025 11:43 AM

Auditor love marriage In Tamil Nadu

కుమార్తెతో వివాహానికి ఏర్పాట్లు 

తమిళనాడు: కెంగవల్లి సమీపంలో తల్లి దండ్రులపై దాడి చేసి యువతిని ఎత్తుకెళ్లిన ఆడిటర్‌ పెళ్లి కోలంలో పోలీసులను ఆశ్రయించాడు. సేలం జిల్లా కెంగవల్లి సమీపంలోని క్రిష్ణపురం పంచాయతీకి చెందిన మణికంఠన్‌(43). ఆడిటర్‌గా ఉంటూ సేలం అంగమ్మాళ్‌ కాలనీలో కార్యాలయం నిర్వహిస్తున్నాడు. అతనికి పెళ్లయ్యాక భార్యతో మనస్పర్థలు రావడంతో పదేళ్ల క్రితం విడాకులు తీసుకున్నాడు. 

మణికంఠన్‌ ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న కొడుకు, 5వ తరగతి చదువుతున్న కుమార్తెతో నివసిస్తున్నాడు.ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన రాజేంద్రన్‌ కుమార్తె విద్యాశ్రీ(21) ప్లస్‌ 2 పూర్తి చేసి ఇంట్లో ఉంటు వచ్చిన స్థితిలో, గత కొన్ని నెలలుగా ఆడిటర్‌ మణికంఠన్‌ ఆఫీసులో పనికి వెళ్లింది. ఇద్దరికీ పరిచయం ఏర్పడడంతో విద్యాశ్రీతో వివాహం జరిపించాలని మణికంఠన్‌ ఆమె తల్లిదండ్రులను కోరాడు. 

అయితే అతని తల్లిదండ్రులు వ్యతిరేకించారు. కాగా, మణికంఠన్‌ తన ఐదుగురు స్నేహితులతో కలిసి మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో విద్యాశ్రీ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమె తల్లిదండ్రులు రాజేంద్రన్, వనిత పై దాడి చేసి విద్యాశ్రీ ని కారులో కిడ్నాప్‌ చేశారు. గాయపడిన రాజేంద్రన్‌ వనితను స్థానికులు రక్షించి కెంగవల్లి ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు దర్యాప్తులో 43 ఏళ్ల ఆడిటర్‌ మణికంఠన్, 21 ఏళ్ల యువతిని ప్రేమ పెళ్లి చేసుకున్నట్లు తేలింది. ఇద్దరూ మేజర్లు కావడంతో వారిని వదిలి వేసినట్లు తెలిసింది.  

 

Advertisement
 
Advertisement
Advertisement