క్యాన్సర్‌పై అవగాహన కోసం మారథాన్‌ | - | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌పై అవగాహన కోసం మారథాన్‌

Aug 3 2026 12:43 AM | Updated on Aug 3 2026 12:43 AM

తిరువళ్లూరు: అడయార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ సంస్థ, వేల్‌టెక్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన మారథాన్‌ పోటీల్లో సుమారు వెయ్యి మంది పాల్గొన్నారు. మరథాన్‌ పోటీల్లో పాల్గొన్న వారి నుంచి సుమారు 15 లక్షల రూపాయలను సేకరించి వాటిని అడయార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు అందజేశారు. తిరువళ్లూరు జిల్లా ఆవడిలోని వేల్‌టెక్‌ వర్సిటీలో జరిగిన మారథాన్‌ పోటీలకు వర్సిటీ మేనేజింట్‌ డైరెక్టర్‌ మహాలక్ష్మి అధ్యక్షత వహించారు. క్యాన్సర్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం, బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహన కల్పిండచడం లాంటి ఉద్దేశాలతో నిర్వహించిన మారథాన్‌ పోటీల్లో పది కిమీ, ఐదు కిమీ, మూడు కిమీ తదితరు మూడు విభాగాల్లో పోటీలను నిర్వహించారు. అడయార్‌ క్యాన్సర్‌ వైద్యశాల సీనియర్‌ సర్జరీ అంకాలజీస్టు అరవింద్‌కృష్ణమూర్తీ పోటీలను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులను సైతం అందజేశారు. మరాథాన్‌ పోటీల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌కు గురై వైద్యశాలలో చికిత్స పొందుతూ, ఆర్థికసాయం కోసం ఎదురుచూస్తున్న బాధితుల కోసం నిధులను సేకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసెంబ్లీ వ్యవహరాల కార్యదర్శి తేన్‌మెళి హాజరై ప్రసంగిస్తూ క్యాన్సర్‌పై స్వల్పంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పెనుప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. తనకు క్యాన్సర్‌ రాదని ఎవ్వరూ ఊహించవద్దని, క్యాన్సర్‌ ఎవ్వరికై నా రావచ్చు. అందుకు తనే ప్రత్యక్ష ఉదాహరణగా భావించాలని వివరించారు. ఇంటి వంటకాలనే తినాలని, బయటి వంటకాలకు ప్రాధాన్యత ఇవ్వొద్దని కోరారు. కార్యక్రమంలో పెద్దసంఖ్యలో విద్యార్థులు, వేల్‌టెక్‌ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement