సంప్రదాయ సిద్ధ వైద్యాన్ని వినియోగించాలి | - | Sakshi
Sakshi News home page

సంప్రదాయ సిద్ధ వైద్యాన్ని వినియోగించాలి

Aug 3 2026 12:43 AM | Updated on Aug 3 2026 12:43 AM

వేలూరు: సంప్రదాయ సిద్ధ వైద్యాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరవింద్‌ కుమార్‌ అన్నారు. వేలూరు శ్రీపురంలోని బంగారుగుడి ఆవరణంలో పీఠాధిపతి శక్తిఅమ్మ 50వ జన్మదినోత్సవాన్ని పురష్కరించుకొని 108 మంది సంప్రదాయ సిద్ద వైద్యులకు సర్టిఫికెట్లు, అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం బంగారుగుడి పీఠాధిపతి శక్తిఅమ్మ అద్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ గత కరోనా కాలంలో సిద్ద వైద్యమే పలువురి ప్రాణాలను కాపాడిందని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. మన విలువలు, సంస్కృతి ప్రపంచ దేశాల మద్య భారత దేశ కీర్తీరిని పెంచాయని దీని వల్ల విదేశియులు కూడా భారతీయ సంస్కృతిని పట్టుదలతో స్కీకరిస్తున్నారన్నారు. బంగారుగుడి పీఠాధిపతి శక్తి అమ్మ మాట్లాడుతూ పట్టుదలతో ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరూ ఇంజనీర్‌, డాక్టర్‌, కలెక్టర్‌గా కావచ్చునన్నారు. అయితే సిద్ధ వైద్యులుగా కావడానికి దైవానుగ్రహం అవసరమన్నారు. ఔషధ మూలికలను ఉపయోగించి వివిధ అనారోగ్యాలను నయం చేసే ప్రయత్నం సామర్థ్యం సిద్ధ వైద్యులకు ఉంటుందన్నారు. మూలికా వైద్యం ద్వారా రెండు మూడు నెలల వ్యవధిలోనే నిర్థిష్ట ఆరోగ్య సమస్యలను సమర్థవంతంగా నయం చేయగలరన్నారు, గత కరోనా కాలంలో సిద్ధ వైద్యులు చేసిన సేవలను ప్రజలు మరలేరన్నారు. దీంతోనే తన జన్మదినోత్సవాన్పి పురష్కరించుకుని నేడు రాష్ట్రప్తంగా ఉన్న సిద్ధ వైద్యులను రప్పించి వారిని సత్కరించడంలో ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో చైన్నె హైకోర్టు న్యాయమూర్తి సెందిల్‌కుమార్‌, నారాయణి ఆసుపత్రి డైరెక్టర్‌ బాలాజీ, బంగారుగుడి డైరెక్టర్‌ సురేష్‌ బాబు, మేనేజర్‌ సంపత్‌కుమార్‌, బంగారుగుడి ఇతర దేశాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement