తిరువళ్లూరు: తిరువళ్లూరు పట్టణంలో ప్రసిద్ధి చెంది న శ్రీ ద్రౌపది అమ్మవారి సమేత ధర్మరాజుల ఆల యం వుంది. ఈ ఆలయంలో ఏటా ఆషాడమాసం నాలుగవ ఆదివారం అగ్నిగుండ ప్రవేశ వసంత ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగానపే ఈ ఏడాది ఉత్సవాలకు గత శుక్రవారం ఉదయం ద్వరాజరోహణంతో అంకురార్పణ జరిగింది. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం అమ్మవారికి తిరుకల్యాణ ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఈనెల 9న దుర్యోధనుడి వదం, రాత్రి అగ్నిగుండ ప్రవేశం, పదిన ధర్మరాజుల స్వామి వారికి పట్టాభిషేకం తదితర ఉత్సవాలను నిర్వహించనున్నారరు. కార్యక్రమంలో ట్రస్టీలు టీఎన్‌ఆర్ శ్రీనివాసన్, సభ్యులు భాస్కరన్, మోహనసుందరి, ఆలయ ఈఓ తిలకర్ పాల్గొన్నారు.


