ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారక ఘటన: ప్రధాని మోదీ | Ar India Plane Crash: Heartbreaking Beyond Words PM Modi | Sakshi
Sakshi News home page

ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారక ఘటన: ప్రధాని మోదీ

Jun 12 2025 4:31 PM | Updated on Jun 12 2025 7:04 PM

Ar India Plane Crash: Heartbreaking Beyond Words PM Modi

ఢిల్లీ: అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు విమాన ప్రమాదం జరిగిన వెంటనే హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడిన ప్రధాని మోదీ.. ఈ ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. 

ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారకర ఘటన అని మోదీ ట్వీట్‌ చేశారు. తాను ఎప్పటికప్పుడు పరిస్థితిన సమీక్షిస్తున్నానని,. బాధితులకు సహాయం చేస్తున్న మంత్రులు, అధికారులతో మాట్లాడుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి

విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విమాన ప్రమాద ఘటన తీవ్రంగా బాధించిందన్నారు.  ఇది హృదయ విదారక ఘటన అని పేర్కొన్న ఆమె.. బాధితులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కష్ట సమయంలో వారికి దేశం అండగా నిలుస్తుందన్నారు. 

 

కాగా, ఈ రోజు గురువారం(జూన్‌ 12) అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమానం కుప్పకూలింది. టేకాఫ్‌ అయిన కాసేపటికే విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 100 మందిపైగా దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విమానంలో 242 మంది ప్రయాణికులున్నారు. 

ఇది మాటల్లో వర్ణించలేని హృదయవిదారక ఘటన : మోదీ

ఇందులో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్‌ దేశస్థులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్‌కు చెందిన వారు ఉండగా, ఒక కెనడా దేశస్థుడు ఉన్నారు. విమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు, ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు. విమాన ప్రమాద ఘటన తర్వాత పలు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. :

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం.. 100 మందికిపైగా మృతి?
 

 

 

Advertisement
 
Advertisement
Advertisement