దాదా.. మీరు మాట్లాడాలనుకుంటే నేను కూర్చుంటాను: అమిత్‌ షా ఫైర్‌

Amit Shah Serious On TMC MP Saugata Roy In Lok Sabha - Sakshi

పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఫైరయ్యారు. ‘దాదా, మీరు మాట్లాడాలనుకుంటే, నేను కూర్చుంటాను. అప్పుడు మీరు మాట్లాడవచ్చ’ అంటూ టీఎంసీ ఎంసీ సౌగతా రాయ్‌కి కౌంటర్‌ ఇచ్చారు. అనంతరం, అమిత్‌ షా కామెంట్స్‌కు బీజేపీ ఎంపీలు సంతోషం వ్యక్తం చేశారు. 

అయితే, పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం లోక్‌సభలో అమిత్‌ షా ప్రసంగించారు. ఈ ప్రసంగంలో అమిత్‌ షా.. దేశంలో పెరుగుతున్న డ్రగ్స్‌ కల్చర్‌, మాదక ద్రవ్యాల ముప్పు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్‌ కల్పించుకుని ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో, సౌగతా రాయ్‌పై అమిత్‌ షా వెంటనే ఆగ్రహం చూపించారు. సభలో సీరియస్‌ అయిన అమిత్‌ షా.. ఆగ్రహంతో దాదా, మీరు మాట్లాడాలనుకుంటే, నేను కూర్చుంటాను. అప్పుడు మీరు మాట్లాడవచ్చు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

అంతటితో ఆగకుండా సీనియర్ ఎంపీగా ఉన్న మీరు ఇలాంటి అంతరాయాలు కలిగించడం కరెక్ట్‌ కాదు. ఇది మీ హోదా, మీ సీనియారిటీకి తగదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, అమిత్‌ షా వ్యాఖ్యలపై సౌగతా రాయ్‌ వెంటనే స్పందిస్తూ.. మీకు అంత కోపం ఎందుకు అంటూ ప్రశ్నించారు. దీంతో, రాయ్‌ ప్రశ్నలకు అమిత్‌ షా సమాధానిమిస్తూ.. తాను కోపగించుకోలేదని, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. ఆ వెంటనే తన సీటులో కూర్చొన్నారు. ఇంతలో స్పీకర్‌ ఓం బిర్లా జోక్యం చేసుకున్నారు. టాపిక్‌ సీరియస్‌నెస్‌ను అర్థం చేసుకోవాలని అన్నారు. ప్రసంగాన్ని కొనసాగించాలని అమిత్‌ షాను కోరారు. దీంతో పైకి లేచిన ఆయన మాట్లాడటాన్ని కొనసాగించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top