
కోచి: దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొం టున్న సినీ దర్శకురాలు అయేషా సుల్తానాను లక్షద్వీప్ పోలీసులు ప్రశ్నించి వదిలేశారు. బీజేపీ నేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కవరట్టి పోలీసులు ఆది, బుధ, గురు వారాల్లో ఆమెను ప్రశ్నించారు. గురువారం దాదాపు మూడు గంటలపాటు జరిగిన విచారణ అనంతరం అయేషా సుల్తానా మీడియాతో మాట్లాడుతూ..‘ఈ విషయం ముగిసింది. కోచి తిరిగి వెళ్తానని పోలీసులకు చెప్పాను. రేపు లేదా ఎల్లుండి కోచికి చేరుకుంటాను’అని అన్నారు.
బుధవారం దాదాపు 8 గంటలపాటు జరిగిన విచారణలో తనకు విదేశాలతో ఏవైనా సంబంధాలున్నాయా అంటూ పోలీసులు ప్రశ్నించారని అంతకుముందు అయేషా చెప్పారు. తన వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్ అకౌంట్లను పోలీసులు పరిశీలించారన్నారు. ఆదివారం పోలీసులు అయేషాను మూడు గంటలపాటు విచారించారు. ‘మలయాళం వార్తా చానెల్ జూన్ 7వ తేదీన నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆమె.. లక్షద్వీప్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం జీవాయుధాలను ప్రయోగించిందని ఆరోపించారంటూ బీజేపీ నేత తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
చదవండి: కోవాగ్జిన్‌కు మరోసారి చుక్కెదురు!