కోవాగ్జిన్‌కు మరోసారి చుక్కెదురు!

Drugs Controller General Of India Not Agree To Give Full License For Covaxin - Sakshi

న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌కు మరోసారి చుక్కెదురైంది. కోవాగ్జిన్‌కు పూర్తి స్థాయి లైసెన్స్ ఇచ్చేందుకు డీసీజీఐ అంగీకరించలేదు. మరింత క్లినికల్‌ ట్రయల్స్‌ డేటా కావాలని భారత్‌ భారత్ బయోటెక్‌కు డీసీజీఐ తెలిపినట్లు సమాచారం. దీంతో ఫుల్‌లైసెన్స్‌ పర్మిషన్‌ ఇచ్చేందుకు మరో ఏడాది సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది.  అంతేకాకుండా కోవాగ్జిన్‌ను గర్బిణీలకు వాడొద్దని డీసీజీఐ తెలిపింది. 

ఇక ప్రస్తుతం అత్యవసర వినియోగం కింద కోవాగ్జిన్‌ వినియోగిస్తున్నారు. ​కాగా, తాజాగా 77.8శాతం సమర్ధత ఉందంటూ డీసీజీఐకి కొవాగ్జిన్‌ డేటా ఇచ్చింది.  మూడో దశ ప్రయోగాలను 25,800 మందిపై చేసిన భారత్‌ బయోటెక్‌ సంస్థ తన డేటాను డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతి కోసం పంపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంపై ఇప్పటి వరకు భారత్‌ బయోటెక్  స్పందించలేదు. ఇప్పటికే అమెరికాలో కోవాగ్జిన్‌ సరఫరాకు యూఎప్‌ఎఫ్‌డీఏ అంగీకరించని సంగతి తెలిసిందే.

చదవండి: వైరల్‌: చెంప దెబ్బ కొట్టిన ఎస్పీ.. కాలితో తన్నిన సీఎం పీఎస్ఓ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top