దేశంలో కొత్తగా 97,894 పాజిటివ్‌ కేసులు | 97894 New Positive Cases In India | Sakshi
Sakshi News home page

దేశంలో కొత్తగా 97,894 పాజిటివ్‌ కేసులు

Sep 17 2020 9:43 AM | Updated on Sep 17 2020 3:51 PM

97894 New Positive Cases In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొసాగుతోంది. కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు రెట్టింపు సంఖ్యలో నమోదవుతున్నాయి. దేశంలో కొత్తగా 97,894 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా.. 1,132మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు 51,18,254కు చేరుకున్నాయి. మొత్తం మృతుల సంఖ్య 83,198కి పెరిగింది. వైరస్‌ నుంచి కోలుకుని ఇప్పటి వరకు 40,25,079 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 10,09,076 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 78.64 శాతం ఉండగా.. మరణాల రేటు 1.63శాతంగా నమోదైంది. ఇక దేశంలో ఇప్పటి వరకు 6,05,65,728 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌బులిటెన్‌ విడుదల చేసింది. (ప్రైవేట్‌ ఆసుపత్రులకు... భారీగా అనుమతులు)

Advertisement
 
Advertisement
Advertisement