ఆ.. ఐదు రాష్ట్రాల్లోనే కరోనా తీవ్రత

5 States Recorded Over I lakh New Corona Cases In First Two Weeks Of June, Out Of Five States Four From South India - Sakshi

ఐదు రాష్ట్రాల్లో అదుపులోకి రాని  కేసులు

దక్షిణాది రాష్ట్రాలను వదలని కరోనా ముప్పు

కోవిడ్‌ కోరల నుంచి బయట పడుతోన్న చిన్న రాష్ట్రాలు  

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి తగ్గినా దక్షిణాది రాష్ట్రాలు ఇంకా గండం నుంచి గట్టెక్కలేదు. దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఇంకా లక్షకు పైగా కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇందులో నాలుగు రాష్ట్రాలు దక్షిణాదివే కావడం గమనార్హం

ఇక్కడే అధికం
ఏప్రిల్‌, మేలలో దేశాన్ని కరోనా సెకండ్‌ వేవ్‌ గడగడలాడించింది, ఆ తర్వాత క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఒక్కో రాష్ట్రం లాక్‌డౌన్‌, కర్ఫ్యూ నిబంధనలు సడలిస్తోంది. అయితే దక్షిణ భారత దేశం ఇంకా కరోనా కబంధ హస్తాల నుంచి బయటపడలేదు. జూన్‌ 1 నుంచి 14 వరకు గణాంకాలు పరిశీలిస్తే తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌  రాష్ట్రాల్లో లక్షకు పైగా కేసులు నమోదు అయ్యాయి.  ఇందులో నాలుగు దక్షిణాది రాష్ట్రాలే.

తమిళనాడు ఫస్ట్‌
కరోనా సెకండ్‌ వేవ్‌ మహారాష్ట్రపై అత్యధిక ప్రభావం చూపించింది. వేవ్‌ మొదలైనప్పటి నుంచి నిన్నా మొన్నటి వరకు మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు నమోదు అవుతూ వచ్చాయి. తాజాగా ఆ స్థానం తమిళనాడుకు మారింది. గత రెండు వారాల్లో తమిళనాడులో 2.43 లక్షల కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో 1.10 లక్షల కొత్త కేసులు వచ్చాయి. 

ఢిల్లీ సేఫ్‌
సెకండ్‌ వేవ్‌ తీవ్రతకు ఢిల్లీ చిగురుటాకుల వణికిపోయింది. ఆక్సిజన్‌ లభించక వందల మంది చనిపోయారు. అయితే కఠిన లాక్‌డౌన్‌ తర్వాత అక్కడ కేసులు తగ్గుముఖం పట్టాయి. క్రమంగా పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. మే ద్వితీయార్థంలో 20.14 వేల కేసులు నమోదు అయితే జూన్‌ ప్రథమార్థంలో ఈ సంఖ్య 4,407కు పడిపోయింది. గోవాలో సైతం కేసుల సంఖ్య 15,555 నుంచి 5,226కి తగ్గింది. 

ఈ రెండు వారాలు కీలకం
లక్షకు పైగా కేసులు నమోదు అవుతున్న ఐదు రాష్ట్రాలకు రాబోయే రెండు వారాలు ఎంతో కీలకం. సడలింపులు ఇస్తూనే కఠిన లాక్‌డౌన్‌/ కర్ఫ్యూ నిబంధనలు అమలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు  వేగంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చేపట్టాల్సి ఉంది.  

చదవండి: కణితి అని భావిస్తే.. వైట్‌ ఫంగస్‌గా తేలింది

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

17-06-2021
Jun 17, 2021, 15:31 IST
సాక్షి, న్యూఢిల్లీ:   కరోనా  మహమ్మారి చికిత్సలో డీఆర్‌డీవో రూపొందించిన  కీలక డ్రగ్‌ను ఇటీవల విడుదల చేసిన దేశీయ ఫార్మా...
17-06-2021
Jun 17, 2021, 13:05 IST
సాక్షి, న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో హైదరాబాద్‌కు చెందిన బయాలాజికల్-ఈ సంస్థ తయారు చేస్తున్నకార్బెవాక్స్ వ్యాక్సిన్‌కు సంబంధించి మరో ఊరట లభించనుంది. దేశంలోనే అత్యంత...
17-06-2021
Jun 17, 2021, 10:38 IST
డెల్టా వేరియెంట్‌ వెలుగులోకి వచ్చాక భారత్‌ నుంచి ప్రయాణాలపై యూకే నిషేధం విధించి రెడ్‌ లిస్టులో ఉంచడంతో వీసా గడువు...
17-06-2021
Jun 17, 2021, 09:27 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. అయితే నిన్నటితో పోల్చితే..  దేశంలో స్వల్పంగా కరోనా కేసులు పెరిగాయి....
17-06-2021
Jun 17, 2021, 08:23 IST
సీనియ‌ర్ న‌టి క‌విత ఇంట్లో క‌రోనా తీర‌ని శోకాన్ని మిగిల్చింది. క‌రోనాతో పోరాడుతున్న ఆమె కొడుకు సంజ‌య్ రూప్‌...
17-06-2021
Jun 17, 2021, 08:13 IST
బనశంకరి: ఇద్దరూ ఇంజనీరింగ్‌ పట్టభద్రులు. కష్టపడితే మంచి భవిష్యత్తు. కానీ తప్పుదోవ తొక్కి కష్టాల్లో పడ్డారు. ప్రియుని ఒత్తిడితో గంజాయి...
17-06-2021
Jun 17, 2021, 05:06 IST
న్యూఢిల్లీ:  కోవిడ్‌–19 చికిత్సలో భాగంగా పెద్దలకు ఇస్తున్న కొన్నిరకాల ఔషధాలను పిల్లలకు కూడా ఉపయోగిస్తున్నారని, ఇలా చేయడం సరైంది కాదని...
17-06-2021
Jun 17, 2021, 03:08 IST
ఎందుకు? ఎప్పుడు? ఎలా? కరోనా వ్యాక్సిన్‌ కోవిషీల్డ్‌ రెండు డోసుల వ్యవధిపై సామాన్య జనానికి వస్తున్న సందేహాలివి.   మొదటి డోసు తీసుకున్న...
17-06-2021
Jun 17, 2021, 03:05 IST
పర్యవేక్షణ చాలా ముఖ్యం  కేసులు తగ్గినప్పుడు కాస్త రిలాక్స్‌ మూడ్‌ వస్తుంది. ఇలాంటి సమయంలో కలెక్టర్లు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి....
16-06-2021
Jun 16, 2021, 11:58 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అతి త్వరలోనే మరో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకొచ్చే విషయంలో  సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) గుడ్‌...
16-06-2021
Jun 16, 2021, 10:04 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. అయితే మంగళవారంతో పోల్చితే.. దేశంలో స్వల్పంగా కరోనా కేసులు పెరిగాయి. భారత్‌లో...
16-06-2021
Jun 16, 2021, 08:45 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ విధించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాన్నిచ్చాయి. ప్రజలు మాస్క్‌లు ధరించడం,...
16-06-2021
Jun 16, 2021, 08:14 IST
సాక్షి, మంచిర్యాలటౌన్‌: ఏడాదిన్నరగా కరోనా మహమ్మారి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే గర్భం దాల్చిన వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది....
16-06-2021
Jun 16, 2021, 07:01 IST
న్యూఢిల్లీ: రెండో వేవ్‌లో పిల్లలు, యువత అధికంగా ప్రభావితమయ్యారన్న వాదనను కేంద్ర ఆరోగ్య శాఖ తోసిపుచ్చింది. 1 నుంచి 20...
16-06-2021
Jun 16, 2021, 06:38 IST
న్యూయార్క్‌: చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా వైరస్‌ లీకయిందని, దీనిపై మరింత లోతైన విచారణ అవసరమని అమెరికా సహా...
16-06-2021
Jun 16, 2021, 04:26 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నెగెటివ్‌ వచ్చిన అనంతరం మహమ్మారితో పోరాటం పూర్తయినట్లేనా అంటే... కాదంటున్నారు నిపుణులు. కరోనా నుంచి కోలుకున్న...
16-06-2021
Jun 16, 2021, 04:18 IST
సాక్షి, అమరావతి: భవిష్యత్తులో కరోనాకు చెక్‌ పెట్టేందుకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తామని.. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా అధిగమించేలా ఏర్పాట్లుచేయాలని...
16-06-2021
Jun 16, 2021, 02:59 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. కట్టుదిట్టమైన కర్ఫ్యూ మూడు రోజులకు ఒకసారి...
15-06-2021
Jun 15, 2021, 20:14 IST
డెహ్రాడూన్‌: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉదృతి కాస్త తగ్గింది. గడిచిన రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా సుమారు మూడు లక్షల...
15-06-2021
Jun 15, 2021, 20:10 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1556 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం సాయంత్రం...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top