Ram Nath Kovind: 21వ శతాబ్దం భారత్‌దే.. మన ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా గొప్పగా ఉంది

21st Century The Century Of India President Ram Nath Kovind - Sakshi

న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా జాతినుద్దేశించి వీడ్కోలు ప్రసంగం ఇచ్చారు రామ్‌నాథ్ కోవింద్. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా గొప్పగా ఉందన్నారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. ఈ సంస్కృతి నేటి యువతను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.  21వ శతాబ్దం భారత్‌దే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

తాను కాన్పుర్‌ దేహాత్‌ జిల్లా పరౌఖ్‌ గ్రామంలోని పేద కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి చేరినట్లు కోవింద్ పేర్కొన్నారు. రాష్ట్రపతిగా తన శాయశక్తుల మేరకు బాధ్యతలు నిర్వర్తించినట్లు తెలిపారు. తనకు సమాజంలోని అన్ని వర్గాలు, ముఖ్యంగా పార్లమెంటేరియన్లు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. సోమవారం ఆమె భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
చదవండి: ఉద్ధవ్ థాక్రేకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు.. ఆయన తలరాత ఆ రోజే ఖరారైంది

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top