హరిత సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

హరిత సన్నద్ధం

Jun 20 2026 12:01 PM | Updated on Jun 20 2026 12:01 PM

జిల్లాలోని వన నర్సరీల్లో సిద్ధంగా ఉన్న మొక్కలు

జిల్లా లక్ష్యం 13.76 లక్షలు

ఉపాధి కూలీలతో గుంతల తవ్వకం

విజయవంతం చేసేందుకు గ్రామీణాభివృద్ధిశాఖ ప్రణాళిక

వరుణుడి కరుణ కోసం అధికారుల ఎదురుచూపులు

నర్వ: రాష్ట్రంలో అడవుల శాతం పెంచేందుకు ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఈ ఏడాది కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంబంధిత అధికారులు ప్రణాళికలు రూపొందించారు. జిల్లా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఉపాధిహామీ పథకం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన నర్సరీల్లో మొక్కలు పెంచి వీటిని నిర్దేశిత ప్రాంతాల్లో నాటేందుకు వివిధ శాఖలకు బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది వన మహోత్సవానికిగాను లక్ష్యాన్ని ఖరారు చేసి వన నర్సరీల్లో షేడ్‌నెట్‌లను ఏర్పాటు చేసి మొక్కలు సంరక్షిస్తున్నారు.

నర్సరీల నిర్వహణ, గుంతల తవ్వకం, మొక్కల సరఫరాపై అధికారుల పర్యవేక్షణ నిరంతరం కొనసాగేలా ప్రణాళిక రూపొందించారు. పంచాయతీరాజ్‌, ఉపాధిహామీ అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షించేలా ఉన్నతాధికారులు కార్యాచరణ చేపట్టారు. ఎంపీడీఓ, ఏపీఓ, ఎంపీఓలు, ఎంపీపీలు, గ్రామస్థాయిలో కార్యదర్శులు, ఉపాధిహామీ మేటీలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సిబ్బందికి సూచనలిచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సిద్ధమయ్యారు.

మండలం మొక్కల లక్ష్యం

మద్దూర్‌ 1,51,530

మక్తల్‌ 1,15,400

దామరగిద్ద 88,200

ఊట్కూర్‌ 86,216

నారాయణపేట 82,154

ధన్వాడ 58,200

నర్వ 55,800

మరికల్‌ 50,000

కొత్తపల్లి 47,000

మాగనూర్‌ 47,000

కోస్గి 42,300

గుండుమాల్‌ 38,500

కృష్ణా 38,200

మండలాల వారీగా లక్ష్యం..

నిరంతర పర్యవేక్షణ..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement