రాహుల్ జన్మదిన
వేడుకలకు హాజరు..
పట్టణంలో కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకల్లో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి రూ.36 లక్షలతో నిర్మించే షెడ్డు పనులకు భూమి పూజ చేశారు. అలాగే మంత్రి సోదరుడు వాకిటి శేషగిరి సొంతంగా ఇప్పించిన 2 కంప్యూటర్లను ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బందికి మంత్రి అందజేశారు. అదేవిధంగా డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉత్తమ మార్కు లు సాధించిన విద్యార్థులను సన్మానించారు.
మక్తల్: ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ఈ నెల 25 నుంచి జులై 24 వరకు కొనసాగుతుందని.. పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. శుక్రవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 7 మండలాల కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు, బూత్ లెవల్ ఏజెంట్లకు ఎస్‌ఐఆర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా ఆయనతో పాటు కాంగ్రెస్‌పార్టీ జిల్లా పరిశీలకుడు రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బూత్ లెవల్ అధికారులు అందించే ఎన్యూమరేషన్ ఫారాలు అర్హులైన ప్రతి ఓటరుకు చేరేలా చూడాలన్నారు. నియోజకవర్గంలో 80 వేల మంది ఓటర్లు ఉన్నారని.. ఓటు చోరీకి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. పశ్చిమ బెంగాళ్‌లో లక్షాలది మంది ఓట్లు తొలగించి టీఎంసీని అధికారంలోకి రాకుండా బీజేపీ ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. మన రాష్ట్రంలోనూ లక్షలాది ఓట్లు తొలగించేందుకు కుట్ర చేస్తోందని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి బూత్‌లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎన్యూమరేషన్ ఫారాలు అందని వారికి చేరేలా కృషి చేయాలని సూచించారు. ఫారం సమర్పించకపోతే జులై 30న విడుదలయ్యే ముసాయిదా ఓటరు జాబితాలో పేరు తొలగిపోయే ప్రమాదం ఉందని.. గ్రామాల్లో అర్హులైన పేర్లు నమోదు చేయించాలన్నారు. వచ్చే నెల 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శిస్తారని.. అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 30 వరకు ఫిర్యాదులు సీకరిస్తారని, అంతలోపే ఓటు హక్కు కాపాడుకోనేందుకు వీలవుతుందని వివరించారు. అనంతరం ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పుర చైర్‌పర్సన్‌వాకిటి మానస, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ గణేష్‌కుమార్, పట్టణ అధ్యక్షుడు రవికుమార్, వాకిటి హన్మంతు, గోవర్ధన్, ఓబులేష్, రవికుమార్, ఆనంద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి


