చేరువైన రక్తశుద్ధి.. | - | Sakshi
Sakshi News home page

చేరువైన రక్తశుద్ధి..

Apr 21 2026 3:56 AM | Updated on Apr 21 2026 3:56 AM

ప్రభుత్వానికి నివేదిక.. వైద్యుడిని సంప్రదించాలి..

కొత్తగా 11 డయాలసిస్‌ కేంద్రాలు మంజూరు

వందలాది మంది బాధితులు..

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఉమ్మడి జిల్లాలో

ఇప్పటికే 12 చోట్ల సేవలు

నూతన యూనిట్లతో

రోగులకు మరింత ఊరట

మూడు నెలల్లో అందుబాటులోకి

తీసుకువచ్చేలా కసరత్తు

పాలమూరు వ్యాప్తంగా

908 మంది బాధితులు

వనపర్తి జిల్లాకు కొత్తగా మూడు యూనిట్లతో పాటు వనపర్తి జనరల్‌ ఆస్పత్రికి మరో రెండు పడకలు అదనంగా మంజూరయ్యాయి. కొత్తగా వచ్చిన రేవల్లి, వీపనగండ్ల, ఖిల్లాఘనపురంలో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడానికి అనువైన స్థలం, విద్యుత్‌, నీళ్లు ఇలా వసతులపై పరిశీలించి.. ఎంత ఖర్చు అవుతుంది.. ఇతర అంశాలపై ప్రత్యేక రిపోర్ట్‌ తయారు చేసి ఈ నెల చివరి నాటికి ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం. త్వరలో పనులు ప్రారంభించి.. అందుబాటులోకి తీసుకువచ్చేలా చూస్తాం.

– సాయినాథ్‌రెడ్డి,

డీఎంహెచ్‌ఓ, వనపర్తి

కిడ్నీ సమస్య ఉన్నవారిలో మొదట నీరసం, ఆకలి మందగించడం, మూత్రం తక్కువగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వారు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అయితే నాణ్యతతో కూడిన డయాలసిస్‌ చేసుకోకపోవడం వల్ల సమస్య పరిష్కారం కావడం లేదు. హెచ్‌డీఎఫ్‌ కానీ హెచ్‌వోఎంఎల్‌, హెచ్‌డీ, నాచ్యురల్‌ హెచ్‌బీ చేస్తే ఫలితం మెరుగైన స్థితిలో ఉంటుంది.

– డాక్టర్‌ శంకర్‌, నెఫ్రాలజిస్టు

కొత్తగా మంజూరైన

డయాలసిస్‌ కేంద్రాలు ఇలా..

జిల్లా యూనిట్‌ పడకలు

గద్వాల వడ్డేపల్లి 5

గద్వాల గట్టు 5

గద్వాల అయిజ 5

వనపర్తి ఖిల్లాఘనపురం 5

వనపర్తి రేవల్లి 5

వనపర్తి వీపనగండ్ల 5

నారాయణపేట కోస్గి 5

నారాయణపేట మద్దూరు 5

నాగర్‌కర్నూల్‌ లింగాల 5

నాగర్‌కర్నూల్‌ అమ్రాబాద్‌ 5

నాగర్‌కర్నూల్‌ తిమ్మాజిపేట 5

పాలమూరు: ఉమ్మడి జిల్లాలో పలు కారణాలతో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీలో భాగంగా తెల్లరేషన్‌ కార్డు కలిగిన బాధితులకు ఉచితంగా సేవలు అందిస్తోంది. అయితే ఉమ్మడి పాలమూరులో సరిపడా డయాలసిస్‌ కేంద్రాలు లేక రోగులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగుల ఇబ్బందులను దూరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 11 డయాలసిస్‌ కేంద్రాలను మంజూరు చేసింది. 11 కేంద్రాల్లో 55 పడకలతో సేవలు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. పబ్లిక్‌– ప్రైవేట్‌ భాగస్వామ్యం విధానంలో వీటిని నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 కేంద్రాలు అందుబాటులో ఉండగా వీటి ద్వారా వందలాది మంది బాధితులకు డయాలసిస్‌ చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో 10, బాలానగర్‌లో 5, నారాయణపేటలో 10, మక్తల్‌లో 5, ఆత్మకూర్‌లో 5, వనపర్తిలో 10, నాగర్‌కర్నూల్‌లో 10, అచ్చంపేటలో 5, కొల్లాపూర్‌లో 5, కల్వకుర్తిలో 5, గద్వాలలో 12, అలంపూర్‌లో 5 మిషన్ల ద్వారా సేవలు అందిస్తున్నారు.

5 పడకల చొప్పున..

కిడ్నీ వ్యాధిగ్రస్తులకు దూరం, ఆర్థిక భారం తగ్గించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో ప్రతి 25 కిలోమీటర్ల దూరానికి ఒక యూనిట్‌ చొప్పున డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాకు నూతనంగా 11 కేంద్రాలు మంజూరు చేయగా.. అన్నిచోట్ల ఐదు పడకలకు ఐదు మిషన్స్‌ ఏర్పాటు చేసి మరో మూడు నెలల్లో సేవలు ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు. పీహెచ్‌సీలు లేదా సివిల్‌ ఆస్పత్రులు ఉన్నచోట ఒక గదిలో వీటిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన చోట నూతన భవనాలు నిర్మించనున్నారు. ప్రతి కేంద్రం దగ్గర నీటిశుద్ధి ప్లాంటు, ఫ్రిజ్‌లు, వైద్య నిపుణులతో పాటు ఇద్దరు సాంకేతిక నిపుణులు, ఇద్దరు స్టాఫ్‌ నర్సులు అందుబాటులో ఉంటారు. ఈ ఐదు పడకలు ఉన్నచోట నిత్యం 20 మందికి రక్తం శుద్ధి చేయనున్నారు. పీపీపీ విధానంలో ఏజెన్సీల ద్వారా నిర్వహించనున్న కొత్త డయాలసిస్‌ కేంద్రాల్లో రక్తశుద్ధి కోసం ఆధునిక యంత్రాలు అందుబాటులోకి తీసుకురానున్నారు.

కిడ్నీ వ్యాధిని కట్టడి చేయాలంటే ప్రధానంగా రోజూ తగినంత వ్యాయామం చేయడం, కావాల్సినంత నిద్రపోవడం, ఒత్తిడి లేకుండా జీవన విధానం పాటించాలి. సరైన మోతాదులో నీరు తాగడం, బీపీ, షుగర్‌ నియంత్రణలో పెట్టుకోవడం చేయాలి. దీర్ఘకాలికంగా కిడ్నీలు చెడిపోయిన రోగుల్లో క్రియాటీన్‌, పొటాషియం శాతాల పెరుగుదల శరీరంలో అదనంగా నీరు చేరిన ఆధారంగా ఎన్నిసార్లు డయాలసిస్‌ చేయాలన్నది ఆధారపడి ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement