నారాయణపేట: ప్రజలకు బాధ్యతగా సేవలు అందిస్తే సమాజంలో పోలీసులపై గౌరవం, మర్యాద మరింత పెరుగుతాయని ఎస్పీ డా. వినీత్ తెలిపారు. కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందడంతో సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ తన చేతులతో శ్రీనివాసులుకు జమిందార్ పట్టీలను అలంకరించి అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. పదోన్నతి అనేది కేవలం ఉత్సాహానికే కాదని, మరింత బాధ్యతను తీసుకొస్తుందని చెప్పారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు భరోసా, నమ్మకం కలిగించే విధంగా పని చేయాలని, నిరుపేద ప్రజలకు పోలీసులు అండగా నిలవాలని సూచించారు.


