దామరగిద్ద: పాలమూరు బిడ్డ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతోనే మక్తల్–పేట–కొడంగల్ ఎత్తిపోతల కల సాకారమైందని.. ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం మండలంలోని కాన్‌కుర్తి శివారులో మల్‌రెడ్డిపల్లి చెరువు దగ్గర రిజర్వాయర్ నిర్మాణానికి డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి, కాన్‌కుర్తి, మల్‌రెడ్డిపల్లి సర్పంచ్‌లు నారాయణ, స్వేత శివకుమార్‌తో కలిసి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందిస్తామని చెప్పి మొదటి విడత కూడా పూర్తి చేయలేదని, అఖిలపక్షం, ప్రజా, రైతుసంఘాలు పార్టీలకు అతీతంగా సహకారం అందించడంతోనే ప్రాజెక్టు నిర్మాణానికి అడుగులు పడ్డాయన్నారు. బ్రిటీష్ కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు సాగునీరు అందించిన సర్ అర్ధన్ కాటన్ మాదిరిగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం కృషి చేస్తున్నారని కొనియాడారు. అందులో భాగంగానే మక్తల్–పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. సుమారు 20 నెలల్లో నిర్మాణం పూర్తిచేసి ఈ ప్రాంతానికి సాగునీరు అందించి సస్యశ్యామలం చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. రైతుల త్యాగం భావితరాలకు ఆదర్శమని.. సర్వం కోల్పోయిన రైతులకు ఇందిరమ్మ ఇల్లు, ప్రాజెక్టులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి అండగా నిలస్తామని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి
కృషితోనే
‘పేట–కొడంగల్’
కల సాకారం
రూ.45 వేల కోట్లతో
యుద్ధప్రాతిపదికన
పనులు
రాష్ట్ర పశుసంవర్ధకశాఖ
మంత్రి
వాకిటి శ్రీహరి


