గుప్తుల కాలం నాటి కోట | - | Sakshi
Sakshi News home page

గుప్తుల కాలం నాటి కోట

Apr 19 2026 7:29 AM | Updated on Apr 19 2026 7:29 AM

అమరచింత: క్రీ.శ. 17వ శతాబ్దంలో గుప్తుల కాలంలో నిర్మించిన చంద్రగఢ్‌ కోట ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. అమరచింత మండలంలోని చంద్రగఢ్‌ గ్రామంలోని కొండపై భాగాన నిర్మించిన ఈ కోట చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. కనుచూపు మేరలో కృష్ణానది కనిపిస్తుండటంతో పర్యాటకులు ప్రాజెక్టుకు వెళ్తూ.. ప్రాచీన కట్టడమైన చంద్రగఢ్‌ను సందర్శిస్తుంటారు. ఇక్కడి చిన్నచిన్న రాజ్యాల నుంచి కప్పం రూపంలో వసూలు చేసిన ధాన్యం, డబ్బులు, బంగారం, వెండి నిల్వలను తరలించే క్రమంలో బసతోపాటు శత్రువుల బారి నుంచి వీటిని కాపాడుకునేందుకు కోటను చంద్రగుప్తుడు నిర్మించాడు. వేసవిలో సైతం తాగేందుకు నీరు లభ్యమయ్యేలా రాతి శిలలలో నీటి గుండాలు ఏర్పాటు చేశారు. కోట చుట్టూ ఫిరంగులు పెట్టి కాపాడేవారు. కోట మధ్యలో శివాలయం నిర్మించి పూజలు ఆచరించేవారు. వందల సంవత్సరాల క్రితం నిర్మించిన కోట ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది.

Advertisement
 
Advertisement
Advertisement