బీసీలు 54.82% | - | Sakshi
Sakshi News home page

బీసీలు 54.82%

Apr 18 2026 7:59 AM | Updated on Apr 18 2026 7:59 AM

నారాయణపేట

కులాల వారీగా జనాభా మొత్తం 37.01 లక్షలు

ఇందులో బీసీలు 20,29,001 మంది

బీసీల్లో ముదిరాజ్‌లు, ఎస్సీల్లో మాదిగలదే అగ్రస్థానం

గద్వాల, వనపర్తిలో ప్రభావిత వర్గాలుగా వాల్మీకి బోయలు

కందనూలులో చెంచుజనాభా 9 వేలకే పరిమితం

రాష్ట్ర సామాజిక, ఆర్థిక, కులగణన రిపోర్ట్‌లో వెల్లడి

.. కొనుగోలు మంట

రాజోళిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు తామే కారణమంటూ మూడు ప్రధాన పార్టీల నేతలు పరస్పర వాదనకు దిగారు.

శనివారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

–8లో u

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లో మెజార్టీ వర్గాలు

ఓసీల్లో రెడ్డిలదే ఆధిపత్యం..

మ్మడి జిల్లాలో మొత్తం ఓసీ జనాభా 2,97,406 మంది కాగా, 8.03 శాతంగా నమోదైంది. ఓసీల్లో మెజార్టీ సంఖ్యలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే ఉన్నారు. వీరిలో నారాయణపేటలో అత్యధికంగా 69.19 శాతం, వనపర్తిలో 66.84 శాతం, జోగుళాంబ గద్వాలలో 63.30 శాతం, నాగర్‌కర్నూల్‌లో 61.06 శాతం, మహబూబ్‌నగర్‌లో 52.40శాతం రెడ్డి జనాభా ఉంది. ఓసీల్లో రెడ్డి సామాజిక వర్గం తర్వాత వైశ్యులు ప్రభావిత వర్గంగా ఉన్నారు. ప్రధానంగా నాగర్‌కర్నూల్‌లో 15.69 శాతం, వనపర్తిలో 13.86 శాతం వైశ్యుల జనాభా ఉంది.

మహబూబ్‌నగర్‌ జిల్లా..

సామాజికవర్గం జనాభా

మాదిగ (ఎస్సీ) 1,04,613

మాల (ఎస్సీ) 16,873

బంజార(ఎస్టీ) 1,12,127

ముదిరాజ్‌ (బీసీ) 1,34,794

యాదవ(బీసీ) 94,144

రెడ్డి(ఓసీ) 44,825

నాగర్‌కర్నూల్‌ జిల్లా

మాదిగ (ఎస్సీ) 1,26,990

మాల (ఎస్సీ) 56,426

బంజార(ఎస్టీ) 96,053

ఎరుకల(ఎస్టీ) 8,073

చెంచు(ఎస్టీ) 8,739

ముదిరాజ్‌(బీసీ) 95,079

రెడ్డి(ఓసీ) 47,021

వైశ్య(ఓసీ) 12,083

వనపర్తి జిల్లా

మాదిగ(ఎస్సీ) 91,157

మదాసికురువ(ఎస్సీ) 8,076

మాల(ఎస్సీ) 5,703

బంజార(ఎస్టీ) 48,978

ఎరుకల (ఎస్టీ) 5,373

వాల్మీకిబోయ(బీసీ) 79,364

ముదిరాజ్‌(బీసీ) 65,605

యాదవ(బీసీ) 79,140

రెడ్డి(ఓసీ) 34,319

వైశ్య(ఓసీ) 7,114

ఎస్సీల్లో 70 శాతానికి మించి మాదిగలే..

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఉన్న సామాజికవర్గాల జనాభా లెక్కలు తేలాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే వివరాలను వెల్లడించింది. ఉమ్మడి జిల్లా జనాభా 37,01,072 మంది కాగా.. అందులో అత్యధికంగా 20,29,001 మంది బీసీలు ఉండడం విశేషం. మొత్తం జనాభాలో బీసీలదే 54.82శాతం ఉన్నట్లు తేలింది. మిగిలిన వర్గాల్లో 20.09 శాతంతో 7,43,606 మంది ఎస్సీ జనాభా ఉండగా, 9.37 శాతంతో 3,42,055 మంది ఎస్టీ జనాభా ఉంది. ఓసీల జనాభా 2,97,408 మందితో 8.03 శాతం కాగా, మైనార్టీల జనాభా 2,89,004 మందితో 7.80 శాతంగా తేలింది.

మ్మడి జిల్లాలో బీసీల తర్వాత 20.09 శాతంతో అత్యధికంగా ఎస్సీ జనాభా ఉండగా, ఇందులో సింహభాగం 70 శాతానికి మించి మాదిగలే ఉన్నారు. ఎస్సీల్లో వీరి జనాభా అత్యధికంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో 83.13 శాతం, వనపర్తిలో 78.86 శాతం, మహబూబ్‌నగర్‌లో 71.88 శాతం, నారాయణపేటలో 71.18 శాతం, నాగర్‌కర్నూల్‌లో 62.41 శాతం ఉంది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మాలల జనాభా అత్యధికంగా 27.73 శాతం ఉంది. ఎస్సీల్లో మాదాసికురువల జనాభా నారాయణపేటలో అత్యధికంగా 10.75 శాతం, గద్వాలలో 5.61 శాతం నమోదైంది.

బీసీల్లో ముది‘రాజులు’..

మ్మడి జిల్లాలోని జనాభాలో సింహభాగం బీసీలే కాగా, ఇందులో ముదిరాజ్‌ సామాజిక వర్గమే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. మొత్తం బీసీ జనాభా 20,29,001 కాగా, వీరి శాతం మొత్తం జనాభాలో సగానికి మించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముదిరాజుల ప్రాబల్యమే ఎక్కువగా ఉండగా, అత్యధికంగా నారాయణపేట జిల్లాలో 36.03 శాతం ఉండటం గమనార్హం. ఆ తర్వాత మహబూబ్‌నగర్‌ జిల్లాలో 22.92 శాతం, నాగర్‌కర్నూల్‌లో 20.37 శాతం, వనపర్తి జిల్లాలో 17.35 శాతం ఉండగా, జోగుళాంబ గద్వాల జిల్లాలో మాత్రం వాల్మీకి బోయ, కురుమ, యాదవ కులాల ప్రభావం ఎక్కువగా ఉంది.

ఉమ్మడి జిల్లాలో కులాల వారీగా జనాభా..

జిల్లా ఎస్సీలు శాతం ఎస్టీలు శాతం బీసీలు శాతం ఓసీలు శాతం ముస్లిం శాతం

మహబూబ్‌నగర్‌ 1,45,543 15.46 1,22,358 12.99 4,76,910 50.65 85,550 9.09 1,11290 11.82

నాగర్‌కర్నూల్‌ 2,03,470 23.61 1,14,503 13.29 4,21,022 48.86 77,004 8.94 45,676 5.30

వనపర్తి 1,15,594 19.22 56,365 9.37 3,46,031 57.54 51,342 8.54 32,032 5.33

జోగుళాంబగద్వాల 1,51,075 22.66 12,141 1.82 4,11,783 61.76 41,749 6.26 49,992 9.51

నారాయణపేట 1,27,924 20.32 36,688 5.83 3,73,255 59.28 41,761 6.63 50,014 7.94

మొత్తం 7,43,606 20.09 3,42,055 9.37 20,29,001 54.82 2,97,408 8.03 2,89,004 7.80

ఉమ్మడి పాలమూరులో తేలిన లెక్క

Advertisement
 
Advertisement
Advertisement