నిబంధనల మేరకే అనుమతులు | - | Sakshi
Sakshi News home page

నిబంధనల మేరకే అనుమతులు

Apr 18 2026 7:59 AM | Updated on Apr 18 2026 7:59 AM

కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

నారాయణపేట: ప్రభుత్వ నిబంధనలను అనుసరించి పాట్ల లే–అవుట్లకు అనుమతులు మంజూరు చేస్తామని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో డిస్ట్రిక్ట్‌ లే–ఆవుట్‌ కమిటీతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లే–అవుట్ల జారీలో అధికారులు అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లాకేంద్రానికి సంబంధించి వచ్చిన నాలుగు లేఅవుట్ల దరఖాస్తులపై అన్ని శాఖల అధికారుల క్లియరెన్‌న్స్‌ను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. కాగా కమిటీకి వచ్చిన నాలుగింటిలో రెండింటికే అనుమతులు జారీ చేసింది. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఫణీంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌ ఈఈ బ్రహ్మానందరెడ్డి, డీటీసీపీఓ కిరణ్‌, తహసీల్దార్‌ అమరేంద్ర కృష్ణ, ఆర్‌అండ్‌బి, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement