విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి

Apr 18 2026 7:59 AM | Updated on Apr 18 2026 7:59 AM

మరికల్‌: ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థులు భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా లక్ష్యంతో చదివితే మంచి ఫలితాలు సాధించగలరని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్‌పర్సన్‌ సీతాదయాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల భోజనం, కూరగాయలు తదితర వాటిని పరిశీలించారు. నిత్యం అందించే భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మెనూ విధిగా పాటిస్తూ భోజనం అందించాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. విద్యార్థులకు విలువతో కూడిన నాణ్యమైన బోధన అందించాలన్నారు. ముఖ్యంగా బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అందరూ సహకరించాలని కోరారు. ఆమె వెంట రాష్ట్ర కమిటీ సభ్యులు అపర్ణ, ప్రిన్సిపాల్‌ నాగమణిమాల, తహసీల్దార్‌ రాంకోటి, నందన్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement