
పదోన్నతుల సందడి
నిరంతర పోరాటం
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.
వాతావరణం
అప్పుడప్పుడు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
–8లో u
● నేటినుంచి ప్రక్రియ ప్రారంభం
● ఎస్జీటీలకు ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం, ఎస్‌ఏలుగా అవకాశం
● స్కూల్ అసిస్టెంట్లకుగెజిటెడ్ హెచ్‌ఎంలుగా ప్రమోషన్
● ఉమ్మడి జిల్లాలో 650 నుంచి 750 మందికి మేలు
● ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం
ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా..
జిల్లా పాఠశాలలు విద్యార్థులు ఉపాధ్యాయులు
మహబూబ్‌నగర్ 791 62,724 4,650
నాగర్‌కర్నూల్ 808 54,152 3,513
వనపర్తి 495 38,147 2,097
జోగుళాంబ గద్వాల 448 55,289 2,064
నారాయణపేట 458 52,314 1,879
ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియ శనివారం నుంచే ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆయా జిల్లాల వారీగా డీఈఓ వెబ్‌సైట్‌లలో గ్రేడ్–2 హెడ్‌మాస్టర్, స్కూల్ అసిస్టెంట్ సమానమైన క్యాడర్ ఖాళీల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చాల్సి ఉంది. వీటితోపాటు గెజిటెడ్ హెచ్‌ఎంలుగా పదోన్నతులు పొందాల్సిన ఎస్జీటీ ఉపాధ్యాయులు సీనియార్టీ ప్రొవిజనల్ లిస్టు, స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు పొందనున్న ఎస్జీటీల ప్రొవిజనల్ సీనియార్టీ లిస్టును ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలి. ఈ మేరకు సీనియార్టీ జాబితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పుకొనేందుకు ఈ నెల 3న అవకాశం ఉంటుంది. అలాగే 4, 5 తేదీల్లో సీనియార్టీ జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి తుది జాబితా విడుదల చేస్తారు. 6న పదోన్నతులకు అర్హులైన వారు వెబ్‌ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం ఉంది. 7న సంబంధిత ఆర్జేడీ, డీఈఓల నుంచి ప్రమోషన్ ఆర్డర్ వెలువడనున్నాయి. ఇలా మొదట హెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల ప్రక్రియను ఈ నెల 11 వరకు పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
ఈ నెల 11 వరకు..

పదోన్నతుల సందడి