
నర్వకు సంపూర్ణ అభియాన్ రాష్ట్రస్థాయి ర్యాంకు
నర్వ: నీతి అయోగ్ చేపట్టిన సంపూర్ణ అభియాన్ పథకానికి ఎంపికై న నర్వ మండలం మూడు నెలలుగా సాధించిన ప్రగతికి రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. ఉమ్మడి జిల్లాలో ఎంపికై న గట్టు మండలంతో పాటు నర్వ మండలం సిల్వర్ మెడల్ సాధించింది.
ఆరు విభాగాల్లో ప్రగతి
మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో ఆరు విభాగాల్లో న్యూట్రీషణ్ (పోషణ), అగ్రికల్చర్, విద్య, నీటి వసతితో పాటు సోషల్ సెక్టార్‌లో మెరుగైన పనితీరు ప్రదర్శించింది. కార్యక్రమంలో గర్భిణులకు, ఆరోగ్య, పోషణ వంటి కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టారు. మండలంలో 21,405 మందికి బీపీ, షుగర్, టీబీ పరీక్షలు నిర్వహించారు. సంపూర్ణ అభియాన్ ద్వారా స్థానిక పీహెచ్‌సీకి అంబులెన్స్ ఏర్పాటు చేశారు. వ్యవసాయంలో రాష్ట్ర కమిషనర్ ఆదేశాల మేరకు 7,145 ఆరోగ్య మట్టి పరీక్షలు నిర్వహించి పరీక్షల కార్డులను రైతులకు అందించారు. మరో 3,200 కార్డులు అందించేలా చర్యలు తీసుకున్నారు. సోషల్‌సెక్టార్ కింద మహిళా సంఘాలకు రూ.9.40 కోట్లు రుణాలు అందించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారం లబ్ధిదారులు వినియోగించుకునేలా చేసి మెరుగైన ఫలితాలు సాధించారు.
కేంద్ర మంత్రి రాకతో..
సంపూర్ణ అభియాన్ పథకానికి ఎంపికై న నర్వ మండలంలో మూడు నెలల ప్రగతిని సమీక్షించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ విచ్చేసి ఆరు విభాగాల పనితీరును పరిశీలించి, సమీక్ష నిర్వహించారు.
నేడు రాజ్‌భవన్‌లో అవార్డు అందుకోనున్న ఎంపీడీఓ

నర్వకు సంపూర్ణ అభియాన్ రాష్ట్రస్థాయి ర్యాంకు