రుణ లక్ష్యం.. నిర్దేశం | - | Sakshi
Sakshi News home page

రుణ లక్ష్యం.. నిర్దేశం

Jul 30 2025 7:26 AM | Updated on Jul 30 2025 7:26 AM

రుణ ల

రుణ లక్ష్యం.. నిర్దేశం

నర్వ: గ్రామీణ ప్రాంత మహిళలను సంఘటితం చేసి, ఆర్థికంగా రాణించేందుకు కృషిచేస్తున్న ప్రభుత్వం.. 2025–26 ఆర్థిక సంవత్సరం రుణ ప్రణాళికను ఖరారు చేసింది. జిల్లాలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ. 262.13కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యం విధించింది. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం బ్యాంక్‌ లింకేజీ రుణాలను ప్రభుత్వం ఏటా అందిస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన రుణ ప్రణాళిక లక్ష్యాన్ని అధిగమించేందుకు ఐకేపీ అధికారులు సన్నద్ధమవుతున్నారు.

రూ. లక్ష నుంచి రూ. 20లక్షల వరకు..

ప్రస్తుతం జిల్లాలో 7,072 మహిళా సంఘాలు ఉన్నాయి. అందులో అర్హత కలిగిన సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తున్నారు. ఆయా సంఘాల సభ్యులు ఏర్పాటుచేసే వ్యాపారాల మేరకు రూ.లక్ష నుంచి రూ. 20లక్షల వరకు ఆర్థికంగా చేయూత అందిస్తున్నారు. చాలా మంది మహిళలు కుటీర పరిశ్రమలు, కిరాణం, పిండిగిర్ని, టైలరింగ్‌, వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలు తీసుకుంటున్నారు. గతంలో మహిళా సంఘాలు తీసుకున్న రుణాల్లో రకవరీ శాతం సక్రమంగా ఉన్న కారణంగా ఈ వార్షిక ఏడాదిలోనూ బ్యాంకర్లు త్వరగానే రుణాలు అందించే అవకాశం ఉంది. గ్రూపు రుణాలే కాకుండా మహిళలు వ్యక్తిగతంగా రూ. 5లక్షల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంది. వారు దేనికోసం రుణం తీసుకుంటున్నారో వివరించాలి. వ్యక్తిగతంగా తీసుకునే రుణాలకు మహిళా సంఘం సభ్యులు పూచీకత్తుగా ఉంటారు.

ప్రతినెలా వడ్డీ చెల్లిస్తే మేలు..

మహిళా సంఘాలకు అందించే రుణాలపై వడ్డీని ప్రభుత్వం ప్రతినెలా క్రమం తప్పకుండా చెల్లిస్తే సభ్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఈ వడ్డీ డబ్బులు సక్రమంగా రాకపోవడంతో మహిళలే ప్రతినెలా బ్యాంకులకు చెల్లిస్తున్నారు. మహిళలు చెల్లించిన వడ్డీని సర్కారు తిరిగి వారి ఖాతాల్లో జమచేస్తోంది. అయితే నెలల తరబడి వడ్డీ బకాయి ఉంటోంది. ప్రభుత్వం ప్రతినెలా వడ్డీ డబ్బులు చెల్లించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.

గతేడాది ఇలా..

జిల్లాలో గతేడాది (2024–25) రుణ లక్ష్యం రూ. 262కోట్లు కాగా.. వందశాతం అచీవ్‌మెంట్‌ సాధించారు. మాగనూర్‌లో 79.66శాతం, కృష్ణాలో 74.89 శాతం మాత్రమే రుణ లక్ష్యం సాధించి కొంత వెనకబడ్డాయని అధికారులు చెబుతున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి..

మహిళా సంఘాల సభ్యులు స్వయం ఉపాధి రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా రుణాలు అందిస్తోంది. ఈ ఏడాది కూడా వార్షిక రుణ లక్ష్యాన్ని విధించింది. ఈ మేరకు వందశాతం లక్ష్యాన్ని చేరుకునేలా దిశానిర్దేశం చేశాం. గతేడాది జిల్లాలో వందశాతం రుణ లక్ష్యం చేరుకున్నాం. రుణ లక్ష్యంలో వెనకబడిన మండలాలను ముందుకు తీసుకెళ్లేలా అధికారులను సమాయత్తం చేస్తాం.

– మొగులయ్య, డీఆర్డీఓ

మహిళల ఆర్థిక సంఘటితమే లక్ష్యంగా ప్రణాళిక

2025–26 ఆర్థిక సంవత్సరం

రూ. 262.13 కోట్ల రుణాలు ఇవ్వాలని టార్గెట్‌

ఒక్కో సంఘానికి రూ.లక్ష నుంచి

రూ. 5లక్షల వరకు అందనున్న రుణాలు

జిల్లాలో 7,072 మహిళా సంఘాలు

రుణ లక్ష్యం.. నిర్దేశం 1
1/3

రుణ లక్ష్యం.. నిర్దేశం

రుణ లక్ష్యం.. నిర్దేశం 2
2/3

రుణ లక్ష్యం.. నిర్దేశం

రుణ లక్ష్యం.. నిర్దేశం 3
3/3

రుణ లక్ష్యం.. నిర్దేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement