
ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల అమలు
నారాయణపేట: ఎన్నికల సమయంలో ఇచ్చిన హా మీ ప్రకారం ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నా మని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకి టి శ్రీహరి అన్నారు. మంగళవారం మంత్రి హోదా లో తొలిసారిగా జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన.. ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి పేదలకు కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదిగితే కు టుంబాలు, ఊర్లు బాగుపడి రాష్ట్రాభివృద్ధికి దోహదం అవుతాయని భావించిన ప్రభుత్వం.. మహిళా అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. అందులో భాగంగా ప్రభుత్వ పథకాలన్నీ మహిళల పేర్లతోనే అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న ఉచిత బస్సు ప్రయాణంపై ప్రతిపక్ష నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పేద కుటుంబాలకు కొత్త రేషన్‌కార్డులు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అధికారం ఉన్నప్పుడు హంగూ ఆర్భాటాలు ఉంటాయని.. తాను మాత్రం సామాన్యమైన జీవితాన్నే గడపాలని కోరుకుంటానని మంత్రి చెప్పారు. నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాలు తనకు రెండు కళ్లలాంటివని.. జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రజా సంక్షేమంలో రాజీ పడబోమన్నారు. ఈ ప్రాంతానికి చెందిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. రూ. 4,500 కోట్లతో మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశారని.. రాబోయే కాలంలో నారాయణపేట మరో తూర్పు, పశ్చిమ గోదావరి అవుతుందని మంత్రి పేర్కొన్నారు. పేటకు మొదటి విడతగా 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని.. వీటిని త్వరగా పూర్తిచేస్తే, అదనంగా మరో 3,500 ఇళ్లు మంజూరు చేయించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.
● కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి మండలంలో కొత్త రేషన్‌కార్డుల పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు. అర్హులైన వారు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే, కొత్త కార్డులు వస్తాయన్నారు. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మాట్లాడుతూ.. తన నాన్న చిట్టెం వెంకటేశ్వరరెడ్డికి, మంత్రి వాకిటి శ్రీహరితో మంచి సత్సంబంధాలు ఉండేవన్నారు. ఈ రోజు మంత్రి పదవిలో బాబాయ్ శ్రీహరిని చూస్తే తనకు గర్వంగా ఉందన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. జిల్లా కేంద్రానికే 900 కేటాయించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయకుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, ఆర్డీఓ రామచందర్ నాయక్, మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కాంతుకుమార్, సివిల్ సప్లై అధికారి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
మహిళల ఆర్థికాభివృద్ధే
లక్ష్యంగా ముందుకు..
జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి