
లయన్స్ క్లబ్ సేవలు గ్రామాలకు విస్తరించాలి
దామరగిద్ద: లయన్స్ క్లబ్ సేవలను మరింత విస్తతం చేయాలని, సామాజిక సేవే పరమావధిగా ముందుకు సాగాలని రాష్ట్ర పోలీస్, హౌసింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని గడిమున్కన్‌పల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు భీమయ్యగౌడ్ అద్యక్షత ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తృతం చేయాలని సూచించారు. అనంతరం దామరగిద్ద మండల నూతన లయన్స్‌క్లబ్ అధ్యక్షుడిగా బసిరెడ్డి, కార్యదర్శి గా ఎం.అశోక్, ట్రెజరర్‌గా తిప్పణ్ణ లను ఎన్నుకున్నారు. సేవల్లో భాగంగా దామరగిద్ద జీపీఎస్, కాన్‌కుర్తి పాఠశాలకు వాటర్ ట్యాంకును, బాపన్‌పల్లికి పలువురి పేదలకు దుప్పట్లు, గడిమున్కన్‌పల్లి గ్రామ విద్యార్థులకు స్కూల్ బ్యాగ్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో హరినారాయణ బట్టడ్, ఉమాకాంత్, రవికుమార్‌గౌడ్, భీమయ్యగౌడ్, రవీంద్రనాథ్, వెంకట్‌రెడ్డి, బసిరెడ్డి, జనార్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.