
మా ప్రాణాలు పోవాలా..
‘వెనకా.. ముందు చూడకుండా రయ్‌మని దూసుకొస్తున్నారు.. దుమ్ము, ధూళి లేచి మధ్యాహ్న భోజనంలో పడుతోంది.. వీటి భయంతో ఇప్పటికే కొంతమంది పాఠశాలకు రావడం మానేశారు.. మా ప్రాణాలు పోవాలా.. అలా అయితేనే వీటిని ఆపుతారా..’ అంటూ మంగళవారం మండలంలోని తిర్మలాపూర్ గ్రామ పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఇసుక టిప్పర్లను అడ్డుకొని రాస్తారోకో చేశారు. దాసర్‌దొడ్డి నుంచి తిర్మలాపూర్ మీదుగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ల డ్రైవర్లు పాఠశాల విద్యార్థులు ఉన్నారనే ధ్యాస లేకుండా దూసుకెళ్తారని, ఇసుక టిప్పర్లతో మా ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటి గురించి అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. – మక్తల్