పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో వుంటుంది. కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం. పరీక్ష కేంద్రాల వద్ద 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా వుండరాదు. ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డిజేలతో ఉరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– యోగేష్ గౌతమ్, ఎస్పీ
ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి
పదో తరగతి వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. పరీక్ష కేంద్రాల్లోని సిబ్బందికి ఐడీ కార్డులు ఇచ్చాం. ఐడీ కార్డు లేని వారికి పరీక్ష కేంద్రానికి అనుమతి లేదు. విద్యార్థులు ఓఎమ్మార్ షీట్ నింపడంలో ఏవైనా పొరపాటు జరిగితే ఇన్విజిలేటర్లను సంప్రదించాలి. గైర్హాజరైన విద్యార్థుల హాల్‌టికెట్ నంబర్లను ఇన్విజిలేటర్లు సరిచూసుకోవాలి. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి.
– గోవిందరాజులు, డీఈఓ
●