మహానందీశా... బస్‌ షెల్టర్‌ ఏదయ్యా! | - | Sakshi
Sakshi News home page

మహానందీశా... బస్‌ షెల్టర్‌ ఏదయ్యా!

Jun 8 2026 9:47 AM | Updated on Jun 8 2026 9:47 AM

మహానంది: మహానందీశా.. మా కష్టాలు కాస్త కనవయ్యా.. అంటూ భక్తులు మొర పెట్టుకోవాల్సిన పరిస్థితి. రాష్ట్రంలోనే ప్రముఖ శైవక్షేత్రంగా విరాజిల్లుతూ ఏడాదికి రూ. 21 కోట్లకు పైగా ఆదాయం వస్తున్నా మహానందీశుడి భక్తులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. బస్సు కోసం నేలపైనే కూర్చునే దుస్థితి రావడం బాధాకరం. ఇంత పెద్ద పుణ్యక్షేత్రంలో బస్సు షెల్టర్‌ ఏర్పాటు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అంటూ వివిధ ప్రాంతాల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండుటెండలో నిలువ నీడ లేకపోవడంతో ఆలయ ప్రాంగణంలో ఉన్న చెట్ల కింద వేచి ఉండా ల్సి రావడం భక్తుల పట్ల అధికారులకు ఉన్న భావన కళ్లకు కడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం పలు ప్రాంతాల భక్తులు బస్సు కోసం ఇలా చెట్టు కింద నేలపై కూర్చున్న దృశ్యమే వారి కష్టాలకు నిదర్శనం.

Advertisement
 
Advertisement
Advertisement