భూ సంరక్షణతోనే వ్యవసాయ ఉత్పాదకత పెంపు | - | Sakshi
Sakshi News home page

భూ సంరక్షణతోనే వ్యవసాయ ఉత్పాదకత పెంపు

Jun 7 2026 9:00 AM | Updated on Jun 7 2026 9:00 AM

నంద్యాల(అర్బన్‌): మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో వ్యవసాయ ఉత్పాదకత పెంచాలంటే భూ సంరక్షణ ఎంతో అవసరమని, అందుకు సమగ్రమైన నేల ఆరోగ్యాన్ని కాపాడే పద్ధతులను విధిగా పాటించాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు. స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో శనివారం కేత్‌ బచావో అభియాన్‌ భూ ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమం సందర్భంగా ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన పోస్టర్లను కలెక్టర్‌ రాజకుమారి, ఏడీఆర్‌ జాన్సన్‌, జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లుతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. ఏడీఆర్‌ జాన్సన్‌ మాట్లాడుతూ భూసంరక్షణ కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నిర్వహించి రైతుల్లో అవగాహన పెంచడానికి శాస్త్రవేత్తలు, వ్యవసాయ సిబ్బంది కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు అశోక్‌కుమార్‌, మంజునాథ్‌, వెంకటరమణమ్మ, కవిత, ఫరీదా, రవిప్రకాష్‌రెడ్డి, సతీష్‌బాబు, అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement