
అదును దాటుతోంది.. ఆందోళన మొలకెత్తుతోంది!
ఉయ్యాలవాడ సమీపంలో పత్తి సాగు కోసం సాల్లు తోలుతున్న రైతు
కమ్ముకుంటున్న మేఘాలు వర్షించడం లేదు. సాగుకు సిద్ధం చేసిన భూములు పదునెక్కడం లేదు. రైతుల్లో ఆందోళన మొలకెత్తుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా వానల్లేక పోవడంతో వ్యవసాయం మందకొడిగా సాగుతోంది. ఇప్పటికే విత్తనం, నాట్లు పూర్తయి సేద్యం పనులు ఊపందుకోవాల్సి ఉండగా ఇప్పటి వరకు 30 శాతం కూడా సాగు కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో పత్తి, మిరప, మొక్కజొన్న, వరి సాగు చేసిన రైతులు నాట్లు వేసి ఎదురు చూస్తున్నారు. కొందరు వరుణుడిపై భారం వేసి చిన్నపాటి వర్షాలకే నాట్లు వేస్తున్నారు. – ఉయ్యాలవాడ

అదును దాటుతోంది.. ఆందోళన మొలకెత్తుతోంది!