మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ప్రైవేట్‌ గూండాల దుర్మార్గ చర్య | - | Sakshi
Sakshi News home page

మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ప్రైవేట్‌ గూండాల దుర్మార్గ చర్య

Aug 2 2025 6:48 AM | Updated on Aug 2 2025 6:48 AM

మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ప్రైవేట్‌ గూండాల దుర్మార్గ

మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ప్రైవేట్‌ గూండాల దుర్మార్గ

బనగానపల్లె: గ్రామ పంచాయతీ, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వకుండా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డికి చెందిన ప్రైవేట్‌ గూండాలు పోలీసుల బందో బస్తుతో ఉచిత మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను కూల్చివేయడం దుర్మార్గమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బనగానపల్లె పట్టణం పాతబస్టాండ్‌లో కూల్చివేసిన వాటర్‌ ప్లాంట్‌ను శుక్రవారం భారీ జనసందోహం మధ్య మాజీ ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాతబస్టాండ్‌లోని గ్రామ పంచాయతీ స్థలంలో 2019లో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రభుత్వ నిధులతో ప్రజల అవసరం కోసం వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయించానన్నారు. అప్పటి నుంచి పట్టణ ప్రజలతో పాటు బనగానపల్లెకు వచ్చే గ్రామీణులు ఈ ప్లాంట్‌ నుంచే మంచినీటిని పొందేవారన్నారు. వాటర్‌ ప్లాంట్‌పై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, తన ఫొటోను ఉండటాన్ని చుస్తూ ఓర్వలేక ప్రైవేట్‌ గూండాలతో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఇంటి సమీపంలో ఉన్న వాటర్‌ ప్లాంట్‌ను కూల్చివేయడం దారుణమన్నారు. ఈ విషయంపై రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారులను అడిగితే కూల్చివేతపై తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారన్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల వద్ద తన ఫొటో ఎక్కడైనా అగుపిస్తే టీడీపీ వారు స్టిక్కర్లు అతికిస్తున్నారని, ఎన్నికల కోడ్‌ ఏమైనా అమల్లో ఉందా అని ప్రశ్నించారు. వాటర్‌ ప్లాంట్‌ను మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డికి చెందిన సొంత స్థలంలో ఏమీ నిర్మించలేదన్నారు. మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌తో పాటు సమీపంలోని చిరువ్యాపారుల దుకాణాలను కూడా కూల్చడం హేమమైన చర్య అన్నారు. బీసీ జనార్దన్‌రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బనగానపల్లె పట్టణంలో సొంత నిధులతో పాటు ప్రభుత్వ నిధులతో నిర్మించిన వాటర్‌ ప్లాంట్స్‌ను తాను అధికారంలో ఉన్న సమయంలో ఎప్పుడూ కూల్చలేదన్నారు. కాటసాని కుటుంబం 40 సంవత్సరాలుగా రాజకీయంలో ఉందని, ఏనాడూ ప్రభుత్వ ఆస్తులను కూల్చలేదని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బనగానపల్లె పట్టణంలో వంద పడకల వైద్యశాలతో పాటు సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్‌ క్లినిక్‌లు నిర్మించానని వాటిని కూడా కూల్చివేస్తారా అంటూ ప్రశ్నించారు.

కూల్చివేసిన వారిపై ఫిర్యాదు చేయాలి

మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను కూల్చివేసేందుకు బాధ్యులైన వారిపై రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. వాటర్‌ ప్లాంట్‌ కూల్చివేతతో ఇక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని, లేదంటే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. కాటసాని వెంట అవుకు, బనగానపల్లె వైఎస్సార్‌సీపీ కన్వీనర్లు కాటసాని తిరుపాల్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ న్యాయవాది అబ్దుల్‌ఖైర్‌, ముస్లిం మైనార్టీ నాయకుడు అత్తార్‌జాహెద్‌, నాయకులు శంకర్‌రెడ్డి, సిద్ధంరెడ్డి రామ్మోహన్‌ రెడ్డి, అనిల్‌, సురేష్‌, కృష్ణారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, వెంకట్రామిరెడ్డి, రవికుమార్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి ఉన్నారు.

ప్రజలకు మంచినీరు అందకుండా చేశారు

మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement