
జీ–2 మాటున దందా
● జిల్లాను ముంచెత్తుతున్న అనుమతిలేని
బయో స్టిములెంట్స్
● గుంటూరు జిల్లా కేంద్రంగా
ఉమ్మడి కర్నూలులోకి దిగుమతి
● మార్కెట్‌లోకి దొంగ బయోలు,
నకిలీ పురుగు మందులు
● తూతూ మంత్రంగా
స్క్వాడ్ బృందాల తనిఖీలు
● కర్ణాటక, తెలంగాణ నుంచీ
అక్రమ విక్రయాలు
ఇటీవల తనిఖీలకు వచ్చిన స్క్వాడ్ బృందాలు ఫామ్ జీ–2 చూడటంతోనే అంతా సవ్యంగా ఉన్నట్లు సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇన్‌వాయిస్ బిల్లులను పట్టించుకున్న దాఖలాలు లేవు. వీటిని పరిశీలించినప్పుడే దొంగ బయోల గుట్టురట్టవుతుంది. అయితే ఆ దిశగా చర్యలు లేకపోవడం మామూళ్ల బంధానికి నిదర్శనంగా తెలుస్తోంది.
జీ–2 అనుమతి ఉన్న కంపెనీ ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్రంగా పనిచేస్తోంది. ఈ కంపెనీకి 6 ఉత్పత్తులకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. అయితే 25 రకాల ఉత్పత్తులను ఉమ్మడి కర్నూలు జిల్లాలో విక్రయిస్తున్నా వ్యవసాయ శాఖ నోరు మెదపని పరిస్థితి.
.. బయో అమ్మకాల్లో కాసుల పంట పండుతుండటంతో అనేక మంది డీలర్లు వీటి అమ్మకాలపై మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కొంత మంది డీలర్లు కాలంచెల్లిన పురుగు మందులను బయోల పేరిట విక్రయిస్తున్నారు. ఆకర్షించే ప్యాకింగ్, పేర్లతో రైతులను మోసగిస్తున్నారు.