
పంద్రాగస్టు వేడుకలకు ఘన ఏర్పాట్లు
నంద్యాల: ప్రజలందరిలో దేశభక్తి భావాలు పెంపొందించేలా ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వేడుకలు నిర్వహింఏ మైదానాన్ని ఆకర్షణీయమైన రీతిలో తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థులకు నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ శాఖల శకటాలు ప్రత్యేకంగా ఉండాలన్నారు. ఆయా శాఖలు ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా అభివృద్ధిపై సందేశ బుక్‌లెట్‌ను సిద్ధం చేయాలన్నారు. స్వాతంత్య్ర సమరయోధులకు, జిల్లా ప్రజాప్రతినిధులకు, అధికారులకు వేర్వేరుగా కుర్చీలు ఏర్పాట్లు చేయాలన్నారు.